EKANTA RADHASAPTHAMI IN TIRUMALA TEMPLE ON FEB 8 _ ఫిబ్ర‌వ‌రి 8న తిరుమ‌ల‌లో ఏకాంతంగా రథసప్తమి

TIRUMALA, 05 FEBRUARY 2022:  In view of continuing Covid restrictions, the annual Radhasapthami fete which is observed every year on the auspicious occasion of Surya Jayanthi, will be observed in Ekantam this year by TTD on February 8.

 

The Saptha Vahana Seva will commence with Suryaprabha Vahanam at Kalyanotsava Mandapam followed by Chinna Sesha Vahanam, Garuda Vahanam, and Hanumantha Vahanam in the first half of the day. Chakra Snanam will be observed in Ranganayakula Mandapam between 2pm and 3pm. The second half of the day witnesses Kalpavriksha Vahanam, Sarvabhupala Vahanam and concludes with Chandraprabha Vahanam in the night.

 

TTD has cancelled all virtual arjitha sevas including Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam, and Sahasra Deepalankara Seva on the day following this special fete.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 8న తిరుమ‌ల‌లో ఏకాంతంగా రథసప్తమి

తిరుమ‌ల‌, 2022 ఫిబ్ర‌వ‌రి 05: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 8న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం ఏకాంతంగా జరుగనుంది. కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆలయంలో వాహనసేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.

రథసప్తమి నాడు వాహనసేవల వివరాలు :

సూర్యప్రభ వాహనం ఉదయం 6 గం||ల నుంచి 8.00 గం||ల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.43 గంట‌ల‌కు)

చిన్నశేష వాహనం ఉదయం 9.00 గం||ల నుంచి 10.00 గం||ల వరకు

గరుడ వాహనం ఉదయం 11.00 గం||ల నుంచి 12.00 గం||ల వరకు

హనుమంత వాహనం మధ్యాహ్నం 1.00 గం||ల నుంచి 2.00 గం||ల వరకు

చక్రస్నానం మధ్యాహ్నం 2.00 గం||ల నుంచి 3.00 గం||ల వరకు (రంగనాయకుల మండపంలో గంగాళంలో నిర్వ‌హిస్తారు. )

కల్పవృక్ష వాహనం సాయంత్రం 4.00 గం||ల నుంచి 5.00 గం||ల వరకు

సర్వభూపాల వాహనం సాయంత్రం 6.00 గం||ల నుంచి 7.00 గం||ల వరకు

చంద్రప్రభ వాహనం రాత్రి 8.00 గం||ల నుంచి 9.00 గం||ల వరకు

ఆర్జిత సేవలు రద్దు :

ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే వ‌ర్చువ‌ల్ ఆర్జిత సేవ‌లైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.