ELABORATE ARRANGEMENTS FOR INTERNATIONAL WOMEN’S DAYCELEBRATIONS ON MATCH 08 _ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

Tirupati, 06 March 2020 :TTD has made elaborate arrangements at the Annamacharya Kala Mandiram in Tirupati for celebrating International Women’s Day on March 8.

The celebrations will begin at 10.30 am with the special lectures by Acharya Duvvuru Jamuna vice chancellor of Sri Padmavathi Women’s University and Dr M Ramalakshmi ,prominent gynaecologist of Chittoor .

All women employees of TTD who will retire from March 2020-2021 will be felicitated on the occasion. 

Meanwhile TTD has been observing this fete since 2008, Among 7000 odd regular employees over 2500 constitute women and another 5000 in outsourcing of the total 14000.

TTD DyEO of welfare department of TTD Smt R Snehalata is supervising all arrangements.

 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2020 మార్చి 06 ;టిటిడి ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీ ఆదివారం తిరుపతిలోని అన్న‌మాచార్య క‌ళామందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఉదయం 10.30 గంట‌ల‌కు కార్యక్రమం ప్రారంభ‌మ‌వుతుంది. ఈ సందర్భంగా శ్రీపద్మావతి మహిళా విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య దువ్వూరు జ‌మున‌, చిత్తూరుకు చెందిన ప్ర‌ముఖ‌ గైన‌కాల‌జిస్ట్  డా.ఎం.రామ‌ల‌క్ష్మి ప్రసంగిస్తారు. అదేవిధంగా, 2020 మార్చి నుండి 2021 ఫిబ్రవరి వరకు పదవీ విరమణ పొందనున్న మహిళా ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.

టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి ఆర్‌.స్నేహలత ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.