ELABORATE ARRANGEMENTS FOR RADHA SAPTHAMI-TTD EO _ రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు :

GODA KALYANAM IN TIRUPATI ON JAN 15

 

SUPRABHATA SEVA TO RESUME IN TIRUMALA TEMPLE FROM JAN 15

 

TIRUMALA, 13 JANUARY 2023: After successfully organising Vaikuntha Dwara Darshanam for ten days providing darshan to over six lakh pilgrims, TTD is now gearing up for yet another important fete, Radhasapthami on January 28 and preparations for the same are under way said, TTD EO Sri AV Dharma Reddy.

 

Speaking to media persons after the monthly Dial your Programme in Tirumala at Annamaiah Bhavan on Friday, the EO said, on that day, Sri Malayappa Swami will bless devotees on seven vahanas on Mada streets including Surya Prabha, Chinna Sesha, Garuda, Hanumanta, Kalpa Vruksha, Sarva Bhupala, and Chandra Prabha vahanas in between Chakrasnanam after four morning vahanams. A meeting with all the Heads of the departments in Tirumala was also conducted to discuss the preparations. 

 

Further briefing on Vaikunta dwara Darshan, the EO said,  TTD has provided Darshan to 9300 devotees belonging to SC/ST/ BC communities of 190 villages where TTD built the SV temples through SRIVANI Trust. TTD has garnered a revenue of Rs. 39.40 crores during these ten days.

 

In order to provide more Darshan to common devotees and to enhance more transparency in SRIVANI darshan, the number of SRIVANI tickets have been limited to just 1000 per day which includes 750 online and 250 offline. 

 

The EO said, TTD will conduct Goda Kalyanam on January 15 in the Parade Grounds of TTD Administrative Building in Tirupati. 

 

EO also said that Suprabhata Seva will resume in Tirumala temple from January 15 onwards with the conclusion of sacred Tiruppavai on January 14. 

 

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy were also present.

 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

6.06 లక్షల మంది భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం

– జనవరి 15న టిటిడి పరిపాలనా భవనం ప్రాంగణంలో గోదా కల్యాణం
– భక్తులకు సంక్రాంతి శుభాకాంక్షలు
– డయల్‌ యువర్‌ ఈవోలో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 13 జనవరి, 2023: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు 6.06 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించినట్టు టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

– హిందువులకు ముఖ్య పండుగైన సంక్రాంతి సందర్భంగా శ్రీవారి ఆశీస్సులతో భక్తులు పాడిపంటలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికీ స్వామివారి కరుణాకటాక్షాలు నిండుగా అందాలని ఆశిస్తున్నాను.

– సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 15న తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల మైదానంలో గోదాకల్యాణం నిర్వహిస్తాం.

– తిరుమల నాదనీరాజన వేదికపై జనవరి 2వ తేదీ నుంచి గరుడ పురాణం ప్రవచనాలు ప్రారంభించాం.

– జనవరి 1న తిరుమలలోని పిఏసి`4(పాత అన్నదాన భవనం)లో అన్నప్రసాద వితరణ ప్రారంభించాం.

వైకుంఠ ద్వార దర్శనం :

– తిరుపతిలో 9 ప్రాంతాల్లో, తిరుమలలోని ఒక ప్రాంతంలో దాదాపు 100 కౌంటర్లు ఏర్పాటుచేసి భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు విరివిగా లభ్యమయ్యేలా చర్యలు తీసుకున్నాం.

– రోజుకు 20 వేలు చొప్పున ఎస్‌ఇడి టికెట్లు, 50 వేలు చొప్పున ఎస్‌ఎస్‌డి టోకెన్లు జారీ చేశాం.

– దర్శన టోకెన్‌ లేకపోతే క్యూలైన్లు పెరిగిపోయి భక్తులు చలికి ఇబ్బందిపడతారనే ఉద్దేశంతో టోకెన్లు ఉన్నవారికే దర్శనం కల్పించాం.

వెనుకబడిన పేదవర్గాల భక్తులకు దర్శనం :

– వెనుకబడిన పేదవర్గాల భక్తులకు టిటిడి రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సమయంలో ఉచితంగా రవాణ, వసతి, భోజనంతోపాటు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం.

– శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోని 190 ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకార గ్రామాల నుండి సుమారు 9300 మంది భక్తులకు జనవరి 3 నుండి 9వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాం.

రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు :

– జనవరి 28న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం.

– ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఒకేరోజు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. చక్రస్నానం నిర్వహిస్తాం.

– వాహనసేవలను వీక్షించేందుకు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, కాఫీ, టి, పాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

శ్రీవాణి దర్శన టికెట్ల తగ్గింపు  :

– 2019లో శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్టు(శ్రీవాణి) ప్రారంభించాం. లక్ష రూపాయల లోపు విరాళం అందించే దాతలకు కూడా ప్రయోజనాలు వర్తింపచేయాలని టిటిడి నిర్ణయించింది. తదనుగుణంగా రూ.10 వేలు విరాళం అందించే దాతలకు ఒక బ్రేక్‌ దర్శన టికెట్‌ జారీ చేస్తున్నాం. ఈ ట్రస్టు నిధులతో పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం, ఆలయాల ధూపదీప నైవేద్యాలకు ఆర్థికసాయం అందిస్తున్నాం. అయితే ఆదాయం కోసమే శ్రీవాణి దర్శన టికెట్లు ఇస్తున్నారని కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.

– మరింత ఎక్కువమంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా శ్రీవాణి ట్రస్టు దాతలకు ఇచ్చే బ్రేక్‌ దర్శన టికెట్లను 1000కి తగ్గించడం జరిగింది. ఇందులో 750టికెట్లు ఆన్‌లైన్‌లో, 250 టికెట్లు ఆఫ్‌లైన్‌లో విడుదల చేయడం జరుగుతోంది.

జనవరి 15 నుండి సుప్రభాతం తిరిగి ప్రారంభం :

– ధనుర్మాసం కారణంగా డిసెంబరు 17వ తేదీ నుండి తిరుమల శ్రీవారికి సుప్రభాత సేవ స్థానంలో నిర్వహిస్తున్న తిరుప్పావై జనవరి 14న ముగియనుంది. జనవరి 15వ తేదీ నుండి సుప్రభాతం సేవ పున:ప్రారంభం కానుంది.

సామాన్య భక్తులు బస చేసే గదుల అద్దె పెంచలేదు  :

– తిరుమలలో సుమారు 7,500 గదులు ఉన్నాయి. ఇందులో 75 శాతం ఉన్న 5 వేలకు పైగా గదులు సామాన్య భక్తులకు కేటాయిస్తున్నాం. వీరు బస చేసే కాటేజిల అద్దె పెంచలేదు. సామాన్య భక్తులు బస చేసే రూ.50/`, రూ.100/`అద్దె గదులను రూ.120 కోట్లతో ఆధునీకరించాం.

– విఐపిల కోసం కేటాయించే గదులలో అద్దె వ్యత్యాసం లేకుండా చేసేందుకే ఎస్వీ గెస్ట్‌హౌస్‌, స్పెషల్‌ టైప్‌, నారాయణగిరి విశ్రాంతి గృహాలలోని 172 గదులను భక్తుల సూచనల మేరకు ఆధునీకరించి, అక్కడి వసతులకు అనుగుణంగానే గదుల అద్దె నిర్ణయించడం జరిగింది.

– ఈ విశ్రాంతి గృహాల్లో దాదాపు 22 ఏళ్ల క్రితం అప్పటి వసతులకు అనుగుణంగా గదుల అద్దెను టిటిడి నిర్ణయించింది. భక్తుల అభిమతానుసారం నూతన ఫర్నీచర్‌, ఏసి, వేడి నీటి కోసం గీజర్లు తదితర వసతులు కల్పించడం జరిగింది. వాస్తవాలు పూర్తిగా తెలుసుకోకుండా దురుద్దేశపూర్వకంగా కొన్ని ప్రచార, ప్రసార, సామాజిక మాధ్యమాలు, కొందరు వ్యక్తులు గదుల అద్దె భారీగా పెంచేశామని టిటిడిపై బురదజల్లే ప్రయత్నం చేయడం దురదృష్టకరం.

– ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.

డిసెంబరు నెలలో నమోదైన వివరాలు :

దర్శనం :

– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 20.25 లక్షలు.
హుండీ :

– హుండీ కానుకలు – రూ.129.37 కోట్లు.
లడ్డూలు :

– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 1.08 కోట్లు.

అన్నప్రసాదం :

– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 38.78 లక్షలు.

కల్యాణకట్ట :
– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 8.45 లక్షలు.

2022లో నమోదైన వివరాలు :

దర్శనం :

– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 2.37 కోట్లు.

హుండీ :

– హుండీ కానుకలు- రూ.1450.41 కోట్లు.

లడ్డూలు :

– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 11.54 కోట్లు.

అన్నప్రసాదం :

– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 4.77 కోట్లు.

కల్యాణకట్ట :

– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 1.09 కోట్లు.

జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం వివరాలు :

దర్శనం :

– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 6.06 లక్షలు.

హుండీ :

– హుండీ కానుకలు – రూ.39.40 కోట్లు.

లడ్డూలు :

– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 34.60 లక్షలు.

అన్నప్రసాదం :

– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 13.71 లక్షలు.

కల్యాణకట్ట :

– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 1.76 లక్షలు.

ఈ కార్యక్రమంలో జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహకిషోర్‌, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్‌ కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఇ`2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.  

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.