ELEVATED WALKWAYS FOR TO OVERCOME HUMAN-ANIMAL CONFLICT IN THE LONG RUN-WILDLIFE CHIEF WARDEN OF AP _ ఎత్తయిన నడకమార్గాల కోసం దీర్ఘకాలిక ప్రణాళిక

OUR EFFORTS TO MAKE FOOTPATH ROUTES SAFE ZONES FOR PILGRIMS AS WELL WILDLIFE

 

TIRUMALA, 12 SEPTEMBER 2023: The intention of both the State Government and TTD is to make the footpath routes to Tirumala safe zones for pedestrian pilgrims and at the same time protecting the interest of wildlife, said the Wildlife Chief Warden of Andhra Pradesh, Sri Y Madhusudhan Reddy.

 

Speaking to media persons at Annamaiah Bhavan in Tirumala on Tuesday, the Principal Chief Conservator of Forests [WL] said, he had discussed in length with the TTD EO Sri AV Dharma Reddy about the short-term and long-term plans to overcome the Human-Animal conflict in the Tirumala footpath routes and ghat roads. Elaborating further he said, after the leopard attack on Lakshita, a six-year-old girl, both the forest and TTD have spruced up the measures along the footpath routes and especially in the Alipiri Footpath route in a big way. “We have placed 20 hi-fi real time cameras and another 300 camera traps all along the Seventh mile and Sri Lakshmi Narasimha Swamy temple and caught hold of five leopards and shifted them to SV Zoo Park. Also procuring 500 nos. advanced sim based real time camera traps. Due to several food establishments along the Alipiri footpath route, the animals like deer, wild pigs, dogs are coming for these food wastes which are in turn prompting the wild cats and other beasts like sloth bear. So restrictions were imposed on eateries. Joint measures like sending the pilgrims in a troupe of 100 with security guards, allowing children to walk along footpath only upto 2pm, movement of two wheelers along ghat roads from 6am to 6pm will continue till the things turn to normalcy”, he added.

 

The Principal Chief Conservator of Forests also said, as a long term measure “Elevated Walkways” have been suggested. The Seshachala Ranges are a treasure house of flora and fauna and rich scenic beauty. These walkways not only enable the pedestrian walkers to experience the natural beauties but also provide free passage to wildlife without obstructing their natural movements”, he further added. 

 

Chief Conservator of Forests Sri Nageswara Rao, Deputy CF of TTD Sri Srinivasulu were also present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎత్తయిన నడకమార్గాల కోసం దీర్ఘకాలిక ప్రణాళిక
 
– క్రూరమృగాలు దగ్గరకు రాకుండా చర్యలు
 
– నడకమార్గాలను సురక్షిత జోన్లుగా మార్చే యత్నం
 
– యాత్రికుల భద్రత, వన్యప్రాణుల సంరక్షణ రెండూ ముఖ్యమే
 
తిరుమల, 2023 సెప్టెంబరు 12: యాత్రికుల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణ రెండూ ముఖ్యమేనని, తిరుమల నడకమార్గాల్లో ఎత్తయిన నడకమార్గాలు ఏర్పాటుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ వైల్డ్‌ లైఫ్‌ చీఫ్‌ వార్డెన్‌ శ్రీ మధుసూధన్‌ రెడ్డి వెల్లడిరచారు. క్రూరమృగాలు దగ్గరకు రాకుండా ఈ మార్గాలను సురక్షిత జోన్లుగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ లక్ష్యమని తెలిపారు. 
 
తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం శ్రీ మధుసూధన్‌ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాత్రికులకు జంతువులు తారసపడకుండా చేపట్టాల్సిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డితో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన తరువాత తిరుమల కాలిబాట మార్గాలు, ఘాట్‌ రోడ్లలో భద్రతా చర్యలను ముమ్మరం చేసినట్టు తెలిపారు. ఏడో మైలు నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు 20 రియల్‌ టైమ్‌ హై-ఫై కెమెరాలు, మరో 300 కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశామన్నారు. మరో 500 అధునాతన సిమ్ బేస్డ్ రియల్ టైమ్ కెమెరా ట్రాప్ లను కొనుగోలు చేసి ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటివరకు 5 చిరుతలను బందించి ఎస్వీ జూపార్కుకు తరలించామని తెలిపారు. 
 
అలిపిరి నడకమార్గంలోని దుకాణాల్లో ఆహార వ్యర్థాలను పడేస్తుండడం వల్ల, వీటి కోసం జింకలు, అడవిపందులు, కుక్కలు వంటి జంతువులు వస్తున్నాయని చెప్పారు. ఈ జంతువుల కోసం చిరుతలు, ఎలుగుబంట్లు ఇటువైపు వస్తున్నాయని, ఈ కారణంగా ఆహారపదార్థాలు విక్రయించే దుకాణాలపై ఆంక్షలు విధించామని తెలిపారు. నడకమార్గాల్లో సాధారణ స్థితి నెలకొనే వరకు సెక్యూరిటీ గార్డు తోడుగా 100 మంది భక్తులను గుంపులుగా పంపడం, 12 ఏళ్లలోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతించడం, ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఘాట్‌ రోడ్లలో ద్విచక్ర వాహనాలు అనుమతించడం వంటి చర్యలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.
 
దీర్ఘకాలిక చర్యగా ఎత్తయిన నడకమార్గాలనే సూచించారు. శేషాచల కొండలు అరుదైన వృక్షజాలం, జంతుజాలంతో గొప్ప ప్రకృతి సౌందర్యాల నిధిగా ఉన్నాయన్నారు. నూతన నడక మార్గాల్లో యాత్రికులు ప్రకృతి అందాలను వీక్షించి గొప్ప అనుభూతిని పొందుతారని, వన్యప్రాణులు హాయిగా సంచరిస్తాయని ఆయన చెప్పారు.
 
ఈ కార్యక్రమంలో ముఖ్య అటవీ సంరక్షణాధికారి శ్రీ నాగేశ్వరరావు, టీటీడీ డెప్యూటీ సీఎఫ్‌ శ్రీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.