EXTENDED PAPERLESS ADMINISTRATION IN TTD- EO SINGHAL_ టిటిడిలో మరింత వేగంగా పేపర్‌ రహిత పాలన- టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 22 Aug. 19: TTD Executive Officer Sri Anil Kumar Singhal today directed IT, officials, to extend the operation of e-office software to enhance the paperless administration in the TTD administration.

Addressing the IT officials at his chambers in TTD administrative building on Thursday, the EO asked the IT officials to explore the feasibility of adapting Iris techniques along with biometric technology in the devotees darshan Program.

He instructed them to provide online bookings of TTD Kalyana mandapams as part of accommodation bookings, and dashboards In TTD local temples to promote darshan footfalls besides online deposits from rents and leaseholders of TTD properties.

He directed officials to design software applications to provide hassle-free admissions in all TTD educational institutions from the next academic year.
He wanted all departments to maintain transparency in their expenses. The TTD engineering department also should in a phased manner put up proposals through e-office from the EE level itself

The EO also urged the IT department to design demos in all languages to facilitate online registration of Srivari Seva.

Tirumala Special Officer Sri AV Dharma Reddy, Tirupati JEO Sri P Basant Kumar, CVSO Sri Gopinath Jetty, Chief Engineer Sri Ramachandra Reddy, FACAO Sri O Balaji, IT in charge Sri Sesha Reddy, Special grade DyEO of services wing Smt DS Kasturi Bai, HDPP Secretary Dr Ramana Prasad and others participated


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడిలో మరింత వేగంగా పేపర్‌ రహిత పాలన- టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2019 ఆగస్టు 22: టిటిడిలో పాలనాసౌలభ్యం కోసం విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ ఆఫీస్‌ విధానం ద్వారా మరింత వేగంగా పేపర్‌ రహిత పాలన అందించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఈవో ఛాంబర్‌లో గురువారం ఐటీ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో స్వామివారి దర్శనార్థం అమలు చేస్తున్న పోటో బయోమెట్రిక్‌ విధానంతోపాటు ఐరీష్‌ టెక్నాలజీ వినియోగంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. వసతి సౌకర్యాల నిర్వహణలో భాగంగా తిరుమలలోని టిటిడి కల్యాణమండపాలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టాలన్నారు. టిటిడి స్థానిక ఆలయాలలో భక్తుల రోజువారి దర్శన సంఖ్య తెలుసుకునేందుకు వీలుగా డాష్‌బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. టిటిడికి సంబంధించి కౌలు, అద్దె చెల్లింపులు ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు వీలుగా చర్యలు చేపట్టాలన్నారు.

వచ్చే ఏడాది నుండి సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా టిటిడి విద్యాసంస్థలలో ఆన్‌లైన్‌ ప్రవేశాల అప్లికేషన్‌ను అమలు చేసేందుకు వీలుగా ఇప్పటినుండే అప్లికేషన్‌ను రూపొందించాలని ఐటీ అధికారులను ఆదేశించారు. టిటిడి కార్యక్రమాల నిర్వహణ మరింత పారదర్శకంగా ఉండేందుకు వీలుగా ప్రతి శాఖలోనూ సమగ్రంగా, క్రమబద్ధంగా ఖర్చుల నిర్వహణ ఉండాలని సూచించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో అభివృద్ధి పనుల అంచనాల వివరాలను దశలవారీగా ఈ ఆఫీస్‌ ద్వారా పంపాలని, ముందుగా తిరుపతిలోని ఈఈ స్థాయి నుంచే పంపేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఈని ఆదేశించారు. శ్రీవారిసేవ చేసేందుకు ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో సులభంగా సేవకులు ఎలా నమోదు చేసుకోవాలనే అంశంపై వివిధ భాషలలో డెమో రూపొందించాలని ఐటీ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి, తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, సిఇ శ్రీ జి.రామచంద్రరెడ్డి, ఎఫ్‌ఏసీఏవో శ్రీ ఓ. బాలాజీ, ఐటీ విభాగం పర్యవేక్షకులు శ్రీ శేషారెడ్డి, సర్వీసుల విభాగం గ్రేడ్‌ డిప్యూటీ ఈవో శ్రీమతి డి.ఎస్‌. కస్తూరి భాయ్‌, డిపిపి కార్యదర్శి డా. రమణప్రసాద్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.