EQUIPMENT DONATED TO SV AYUR HOSPITAL _ ఎస్వీ ఆయుర్వేద వైద్యశాలకు ప్రవాస భారతీయులు వైద్య పరికరాల విరాళం

Tirumala, 6 March 2022: NRI couple Smt Geeta Krishna and Sri Kedarnath from San Francisco of USA have donated Rs. 75000 worth of medical equipment to SV Ayurvedic Hospital in Tirupati on Sunday.

They handed over the equipment to the Chief of the Hospital Dr Muralikrishna.

Nursing Superintendent Smt Pushpalata, Staff Nurses Smt Swarna, Smt Hema Sudha were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఎస్వీ ఆయుర్వేద వైద్యశాలకు ప్రవాస భారతీయులు వైద్య పరికరాల విరాళం
 
తిరుపతి, 2022 మార్చి 06: అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో లో ఉంటున్న ప్రవాస భారతీయులు శ్రీ కేదార్నాథ్, శ్రీమతి గీతాకృష్ణ దంపతులు తిరుపతిలోని శ్రీ శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాలకు ఆదివారం వైద్య పరికరాలను విరాళంగా అందించారు.
 
ఈ దంపతుల రెండు సంవత్సరాల కుమార్తెకు హైపో ఆక్సిక్ బ్రెయిన్ డామేజ్ కారణంగా మెదడు ఎదుగుదల లోపం వల్ల  బుద్ధిమాంద్యం అనే రుగ్మత ఏర్పడింది.  ఆయుర్వేద కళాశాలలోని చిన్న పిల్లల విభాగంలో వీరి పాపకు అడ్మిషన్ పొంది పంచకర్మ చికిత్స చేయించారు. ఈ చికిత్స విధానం, ఇక్కడి వైద్య సేవలపై వారు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
 
ఈ మేరకు ఆదివారం ఆస్పత్రికి అవసరమైన రూ.75000 విలువైన వైద్య పరికరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్  డాక్టర్ మురళీకృష్ణ కు  విరాళంగా అందించారు. 
 
ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పుష్పలత, స్టాఫ్ నర్సులు శ్రీమతి స్వర్ణ, శ్రీమతి హేమసుధ పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.