FEBRUARY MONTH FESTIVALS AT SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో విశేష ఉత్సవాలు
Tirupati, 31 January 2021: All festival at Sri Govindaraja Swamy temple will be held in ekantham during the month of February in view of Covid guidelines.
February 1: Thirumanjanam and Asthanam of Sri Govindaraja Swamy and His consorts on Uttara nakshatram.
February 2: Pedda Sattumora on Tirunakshatram of Sri Kurathalwar as part of Adhyayanotsavam
February 5: Adhyayanotsavams concludes.
February 5, 12,19,26: On all Fridays special abhisekam for Goddess Sri Andal and Sri Pundarikavalli and asthanam in the evening,
February 7,23: On Ekadasi day – Special Thirumanjanam for utsava idols of Sri Govindaraja swamy.
February 11: Abhisekam and Asthanam in the evening on Shravana Nakshatram for Sri Kalyana Venkateswara Swamy.
February 19: Rathasapthami festival.
February 20-26. Teppotsavam (float festival).
February 20: Special Abhisekam and Asthanam for Rukmini, Satyabhama Sameta Sri Parthasarathy Swami on Rohini Nakshatram.
February 27: Poornami Poolangi Seva for Sri Govindaraja Swamy.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2021 జనవరి 31: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్ – 19 నిబంధనల నేపథ్యంలో ఈ కార్యక్రమాలన్నీ ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
– ఫిబ్రవరి 01 న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారికి తిరుమంజనము మరియు ఆస్థానం నిర్వహిస్తారు.
– ఫిబ్రవరి 2న శ్రీ కూరత్తాళ్వారు వర్ష తిరు నక్షత్రం మరియు అధ్యయనోత్సవాలలో పెద్ద శాత్తుమొర
– ఫిబ్రవరి 5, 12, 19, 26వ తేదీల్లో శుక్రవారం నాడు శ్రీ ఆండాళ్ అమ్మవారికి, శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.
– ఫిబ్రవరి 05న అధ్యయనోత్సవాలు ముగుస్తాయి.
– ఫిబ్రవరి 7, 23వ తేదీలలో ఏకాదశి సందర్భంగా శ్రీ గోవిందరాజ స్వామి ఉత్సవర్లకు ప్రత్యేక తిరుమంజనము నిర్వహిస్తారు.
– ఫిబ్రవరి 11న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారికి అభిషేకం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.
– ఫిబ్రవరి 19న రథసప్తమి.
– ఫిబ్రవరి 20 నుండి 26వ తేదీ వరకు తెప్పోత్సవాలు.
– ఫిబ్రవరి 20న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారికి ప్రత్యేక అభిషేకాలు సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.
– ఫిబ్రవరి 27 పౌర్ణమి సందర్భంగా శ్రీ గోవిందరాజ స్వామి వారికి పూలంగి సేవ నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.