FIRST CITIZEN OF INDIA OFFERS PRAYERS IN THE HILL SHRINE OF LORD VENKATESWARA_ శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్ కోవింద్
Tirumala, 14 Jul. 19: The Honourable President of India, H.E.Sri Ramnath Kovind along with his family and entourage, offered prayers at the Hill temple of Lord Venkateswara in Tirumala on Sunday.
The first citizen of India, who was on a two-day maiden visit to Tirumala, followed the temple tradition. He first offered prayers in Sri Bhu Varaha Swamy Temple located adjacent to Swami Pushkarini and later reached the Tirumala temple.
The Prez was welcomed by TTD Trust Board Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal and Special Officer Sri AV Dharma Reddy on his arrival at Mahadwaram. The temple priests offered him traditional Isthikaphal welcome amidst the chanting of Veda mantras accompanied by melam.
He was greeted by the Honourable Governor of Andhra Pradesh and Telangana State Sri ESL Narasimhan who accompanied him for darshan.
President offered prayers in front of Lord Venkateswara, along with his spouse Savita Kovind and daughter Ms.Swati. One of the chief priest’s of the temple Sri Venugopala Dikshitulu explained the significance of the presiding deity and the importance of jewels adorned to the Mula Virat.
After darshan of Lord, the EO explained the President about the Retractable Roof arranged from Padikavili to Dhwaja Mandapam to shield pilgrims from inclement weather conditions.
Later at Ranganayakula Mandapam, Vedasirvachanam was rendered to the Honourable President and His family. The Teertha prasadams, laminated photo frame of Lord and Sesha Vastram were presented to the President by TTD Chairman and EO.
H.H. Tirumala Pedda Jiyar Swamy, H.H. Chinna Jiyar Swamy were also present during the prayers.
Among the others who were present includes Deputy CM Sri Narayana Swamy, MP Sri Vijay Sai Reddy, Chandragiri MLA and TUDA Chief Sri C Bhaskar Reddy, DIG Sri Kranti Rana Tata, SP Sri Anburajan, CVSO Sri Gopinath Jatti and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్ కోవింద్
తిరుమల, 2019 జూలై 14: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ఆదివారం ఉదయం భారత రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్ కోవింద్ దర్శించుకున్నారు. గౌ|| రాష్ట్రపతి వెంట ఆయన సతీమణి శ్రీమతి సవితాకోవింద్, కుమార్తె కుమారి స్వాతి, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గౌ|| శ్రీ ఇ.ఎస్.ఎల్ సరసింహన్ దంపతులు ఉన్నారు.
గౌ|| రాష్ట్రపతి ఆదివారం ఉదయం 5.30 గంటలకు తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరి తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహస్వామివారిని దర్శించుకున్నారు.
అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న గౌ|| రాష్ట్రపతికి టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, ప్రత్యేకాధికారి శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ”ఇస్తికఫాల్” ఆలయ మర్యాదలతో ఆగమోక్తంగా స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం గౌ|| రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీశ్రీశ్రీ తిరుమల పెద్దజీయంగార్ స్వామి, శ్రీశ్రీశ్రీ తిరుమల చిన్నజీయంగార్ స్వామి ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ప్రధాన అర్చకులలో ఒకరైన శ్రీ వేణుగోపాల్ దీక్షితులు శ్రీవారి ఆలయ ప్రాశస్త్యాన్ని, సన్నిధిలోని ఇతర ఆలయాల గురించి వివరించారు.
ముడుచుకునే పైకప్పును పరిశీలించిన గౌ|| రాష్ట్రపతి
శ్రీవారి ఆలయంలో పడికావిలి నుండి ధ్వజస్తంభం మధ్య ఏర్పాటుచేసిన ముడుచుకునే పైకప్పు పనితీరును గౌ|| రాష్ట్రపతి పరిశీలించారు. ఎండకు, వర్షానికి భక్తులు ఇబ్బంది పడకుండా ఈ మేరకు ఏర్పాటు చేసినట్లు టిటిడి ఈవో వివరించారు.
అనంతరం రంగనాయకుల మండపంలో గౌ||రాష్ట్రపతికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఛైర్మన్, ఈవోలు కలిసి శ్రీవారి శేష వస్త్రాన్ని, తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని గౌ|| రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్, గవర్నర్ గౌ|| శ్రీ ఇ.ఎస్.ఎల్ సరసింహన్‌కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ నారాయణస్వామి, ఎమ్.పి.శ్రీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ విప్ మరియు తుడ ఛైర్మన్ శ్రీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, డిఐజి క్రాంతి రాణా టాటా తిరుపతి అర్బన్ ఎస్‌పి శ్రీ అన్భురాజన్, టిటిడి అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీహరీంద్రనాథ్, శ్రీ బాలాజీ, ఆరోగ్యశాఖాధికారి డా..ఆర్.ఆర్.రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.