FREE AYURVEDA CAMP IN DURGA SAMUDRAM _ ఎస్ వి ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో దుర్గ సముద్రం గ్రామంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

TIRUPATI, 22 OCTOBER 2022: In connection with National Ayurveda day free Ayurvedic camp was observed under the aegis of SV Ayurvedic college in Durga Samudram on Saturday.

The awareness program on free medicines, health formulae to be followed etc.were taught to the villagers in Dharmarajula temple premises from 9am to 1pm.

Principal Dr Muralikrishna, Ayurvedic doctors Dr Sundaram, Dr Renu Dixit, Dr Harshavardan, Dr Durga, Dr Gnana Prasoona, Dr Rr Raj Kumar, Dr Suneela, Dr Ravindra, Program Officer Dr Chandra Kishore and other faculty and students were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్ వి ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో దుర్గ సముద్రం గ్రామంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

తిరుపతి, 2022 అక్టోబ‌రు 22: జాతీయ ఆయుర్వేద దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా
శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో దుర్గ సముద్రం గ్రామంలో శనివారం ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని నిర్వహించారు.

దుర్గ సముద్రం గ్రామంలోని ధర్మరాజుల ఆలయ ప్రాంగణంలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆయుర్వేదం పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉచితంగా మందుల పంపిణీ తో పాటు ఆరోగ్య సూత్రాలు, వాటి గురించి అవగాహన, నిత్యజీవితంలో అనుసరించడం ద్వారా కలిగే ఉపయోగాలు, వ్యాధుల నివారణ తదితర అంశాలపై కళాశాల వైద్య నిపుణులు వివరించారు.

ఇదిలా ఉండగా , అక్టోబర్ 20వ తేదీ కళాశాలలోని విద్యార్థులకు విద్యార్థుల నైపుణ్యం వెలుగు తీయడానికి ఇంటింటికి ఆయుర్వేదం అనే అంశం మీద పోస్టర్ రూపకల్పన వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అక్టోబర్ 21వ తేదీ ఆయుర్వేదం మానవ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, అధ్యాపకులు డా. సుందరం, డాక్టర్ రేణు దీక్షిత్, డా. హర్షవర్ధన్, డా. దుర్గ, డా. జ్ఞాన ప్రస్సూన, డా . రాజకుమార్ డా.సునీల డా. రవీంద్ర , ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. చంద్ర కిషోర్ ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.