GARUDA PURANAM CONCLUDES AFTER SIX MONTHS _ గరుడ పురాణం జీవిత ప్రయాణం యొక్క సారాంశం
GARUDA PURANA NARRATES THE ESSENCE OF LIFE’S JOURNEY – SPEAKERS
TIRUMALA, 02 JULY 2023: One of the most important sacred texts among the Astadasa Puranas in Hindu Sanatana Dharma penned by Sage Veda Vyas, the Garuda Purana concluded on a grand spiritual note in Nada Neerajanam platform at Tirumala on Sunday evening.
In the Parayana Yagnam taken up by TTD seeking divine intervention to safeguard the entire humanity during the Covid pandemic, Garuda Purana began on January 2 early this year and lasted for six months and concluded on July 2. Renowned Vedic Scholars from Dharmagiri Veda Vignana Peetham, Sri Satyakishore and Sri Kumara Swamy explained the essence of each shloka and rendered shlokas respectively from Garuda Purana for over 180 days which is being telecasted live by SVBC between 6pm and 7pm everyday.
On the last day, both the Vice-Chancellors of SV Vedic University and National Sanskrit University in Tirupati participated and appreciated the proficiency of both the narrator and shloka reciter on the occasion.
While Sri Satya Kishore who narrated the shlokas said, Sage Vedavyas compiled the Astadasa puranas to draw the attention of the reader or its listener towards the ultimate goal of Dharma and the Supreme Lord. He said the entire epic of Garuda Purana is in the form of a wonderful conversation between Garuda and Lord Vishnu regarding the meaning of human life. Uniqueness of Garuda Purana lies in the fact that it is the only sacred text that talks about the life after death, the journey of the soul, death and its aftermath, rebirth or reincarnation.
He thanked TTD EO Sri AV Dharma Reddy who has given him the opportunity to narrate a challenging subject like Garuda Purana. “There is a misconception and doubts among devotees to listen to the Garuda Puranam due to its contents. It took us almost a month to convince them that how essential it is to know the contents to lead a pious and sin-free life. Reading or listening to Garuda Purana will definitely change the mindset of an evil-doer or a sinner. Garuda Purana is a great and mystical book that contains information that enlightens us to know the true journey of life”, he maintained.
Later Vishnu Panjara Stotram and Vasudeva Stotrams were also recited.
Earlier, Smt Chinnama Devi of SV College of Music and Dance presented the famous Annamacharya Kriti, “Itu Garudanu Neevekkinanu” at the beginning of the programme.
CEO SVBC Sri Shanmukh Kumar felicitated both vedic scholars and presented them the portrait of Sri Venkateswara Swamy and prasadams at the end of the programme.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గరుడ పురాణం జీవిత ప్రయాణం యొక్క సారాంశం
– నాదనీరాజనంపై ముగిసిన గరుడ పురాణ పారాయణం
తిరుమల, 2023 జూలై 02: సనాతన హిందూ ధర్మంలో వేదవ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాలలో అత్యంత ముఖ్యమైన గ్రంథాలలో ఒకటైన గరుడ పురాణ పారాయణం ఆదివారం సాయంత్రం తిరుమలలోని నాద నీరాజనం వేదికపై ముగిసింది.
కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచ మానవాళిని రక్షించడానికి శ్రీవారి అనుగ్రహాన్ని కోరుతూ టీటీడీ చేపట్టిన పారాయణ యజ్ఞంలో భాగంగా ఈ ఏడాది జనవరి 2న గరుడ పురాణ పారాయణం ప్రారంభమై ఆరు నెలల పాటు కొనసాగి ఆదివారం ముగిసింది.
180 రోజుల పాటు గరుడ పురాణంలోని ప్రతి శ్లోకం యొక్క సారాంశాన్ని నేటి సమాజానికి అన్వయించి వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
తిరుపతి ఎస్వీ వేద విశ్వవిద్యాలయం విసి ఆచార్య రాణి సదాశివమూర్తి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విసి ఆచార్య కృష్ణమూర్తి పాల్గొని ఈ సందర్భంగా వ్యాఖ్యాత మరియు శ్లోక పారాయణకర్తల నైపుణ్యాన్ని అభినందించారు.
శ్లోకాలను వివరించిన శ్రీ సత్య కిషోర్ మాట్లాడుతూ, వేదవ్యాసుడు అష్టాదశ పురాణాలను లోకానికి ధర్మ బద్ధమైన జీవితాన్ని గడపడం ద్వారా పరమాత్ముడిని చేరడమే అంతిమ లక్ష్యమనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారన్నారు. గరుడుడు మరియు విష్ణువు మధ్య జరిగిన అద్భుతమైన సంభాషణ గరుడ పురాణం రూపంలో ఉందని తెలిపారు. గరుడ పురాణంలో మరణం తరువాత జీవితం, ఆత్మ యొక్క ప్రయాణం, మరణం మరియు దాని అనంతర పరిణామాలు, పునర్జన్మ గురించి మాట్లాడే ఏకైక పవిత్ర గ్రంథమని వివరించారు.
గరుడ పురాణం వంటి మహత్తర గ్రంధాన్ని వివరించే అవకాశాన్ని కల్పించిన టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మా రెడ్డికి శ్రీ సత్య కిషోర్ కృతజ్ఞతలు తెలిపారు. “గరుడ పురాణంలోని విషయాలను వినడానికి భక్తులలో అపోహలు, సందేహాలు ఉన్నాయన్నారు. పవిత్రమైన మరియు పాపరహితమైన జీవితాన్ని గడపడానికి గరుడ పురాణం తెలుసుకోవడం ఎంత ఆవశ్యకమో భక్తులకు వివరించి ఒప్పించడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టిందన్నారు. గరుడ పురాణం చదవడం లేదా వినడం వల్ల దుష్ట, పాపాపు ఆలోచనా విధానం ఖచ్చితంగా మారుతుందని తెలిపారు. గరుడ పురాణం అనేది జీవితపు నిజమైన ప్రయాణాన్ని తెలుసుకోవడానికి, మానవాళికి జ్ఞానోదయం కలిగించే గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం” అని ఆయన వివరించారు. గరుడ పురాణం ఆలకించిన భక్తకోటికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం విష్ణు స్తోత్రం, వాసుదేవ స్తోత్రాలు కూడా పఠించారు.
ముందుగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాలకు చెందిన శ్రీమతి చిన్నమ దేవి కార్యక్రమం ప్రారంభంలో ప్రసిద్ధ అన్నమాచార్య కృతి “ఇటు గరుడను నీవెక్కినను” అందించారు.
కార్యక్రమ ముగింపులో ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్‌కుమార్ వేదపండితులను సన్మానించి, శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.