GOKULASTAMI IN TTD TEMPLES_ తితిదే స్థానిక ఆలయాలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు

Tirupati, 15 Aug. 17: Meanwhile the festival of Janmastami was celebrated with utmost devotion in all the temples dedicated to Lord Krishna run by TTD.

The Krishna Swamy temple in Tiruchanoor, Sri Venugopalaswamy temple in Kapileswara Swamy temple and also in Karvetinagaram observed the fete in a grand manner.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తితిదే స్థానిక ఆలయాలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు

తిరుపతి, 2017 ఆగస్టు 15: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, తిరుచానూరు శ్రీకృష్ణస్వామి ఆలయం, తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, నారాయణవనం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఆగష్టు 16వ తేదీ ఉట్లోత్సవం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

తిరుపతిలోని కపిలితీర్ధం వద్ద వున్న శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు స్వామివారికి వీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఆనంతరం ఆలయంలో ఆస్థానంతో గోకులాష్టమి ఉత్సవం ముగుస్తుంది.

తిరుచానూరు శ్రీకృష్ణస్వామి ఆలయంలో

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి వారి ఆలయంలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం మూలవర్లకు అభిషేకం చేపట్టారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శ్రీకృష్ణస్వామివారికి ఊంజల్‌సేవ నిర్వహించారు. రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారు పెద్దశేషవాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అనంతరం రాత్రి 8.30 నుండి 8.30 గంటల వరకు ఆస్థానం
నిర్వహించనున్నారు.

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం సాయంత్రం 3.00 నుండి 4.00 గంటల వరకు శ్రీకృష్ణస్వామివారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5.00 నుండి 5.30 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం వైభవంగా నిర్వహించనున్నారు.

నారాయణవనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో

నారాయణవనం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం సాయంత్రం 4.30 నుండి 5.00 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారికి అభిషేకం, సాయంత్రం 6.00 నుండి 6.30 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం, నివేదన చేయనున్నారు.

ఈ సందర్భంగా ఈ రెండు రోజుల్లో తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.