GOKULASTAMI ASTHANAM ON AUGUST 19 _ తిరుమలలో ఆగస్టు 19న గోకులాష్టమి ఆస్థానం, 20న ఉట్లోత్సవం

TIRUMALA, 16 AUGUST 2022: Gokulatami Asthanam will be observed on August 19 while Utlotsavam on August 20 in Tirumala.

The Asthanam will take place between 7 pm and 9 pm at Bangaru Vakili the deities of Sridevi, Bhudevi, Sri Ugra Srinivasamurty, Sri Krishna Swamy, and Ekanta Tirumanjanam will be performed.

Later Dwadasaradhanam will be performed.

On August 20, Utlotsavam will be performed from 4 pm onwards in Tirumala. Sri Malayappa and Sri Krishna Swamy on different Tiruchis take part in this traditional fete and bless devotees.

In connection with this festival, TTD has canceled Arjita sevas including Arjita Brahmotsavam and Sahasra Deepalankara Seva for the day.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

తిరుమలలో ఆగస్టు 19న గోకులాష్టమి ఆస్థానం, 20న ఉట్లోత్సవం

తిరుమల, 2022 ఆగ‌స్టు 16 ; తిరుమ‌ల‌ శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 19వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.

శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 7 నుండి 9 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు.

ఆగస్టు 20న తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంట‌ల‌కు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు.

ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 20న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిసేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.