GOLDEN CROWN AND SILVER PADALU DONATED TO LORD VENKATESWARA_ తిరుమల శ్రీవారికి స్వర్ణకిరీటం, వెండి పాదాలు బహూకరణ
Tirumala, 27 August 2018: A Tamil Nadu based devotee, Sri K Dora swamy, son of Sri Kannaiah donated a golden crown and silver padalu to lord Venkateswara on Monday evening.
The devotee handed over the precious donation to TTD Trust Board Chairman Sri Putta Sudhakar Yadav in TSR Rest House at Tirumala.
Speaking about the donation the Chairman said, the pilgrims to Tirumala temple is increasing day by day and the devotees are giving donations in various forms to express their devotion towards Lord Venkateswara. Today a devotee hailing from Gudiyattam, Vellore district of Tamil Nadu donated Rs.28 lakhs worth 1.1kilo weighing gold crown and Rs.2 lakhs worth pair of silver padalu weighing about 1.6kilos to Lord Venkateswara”, he added.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI
తిరుమల శ్రీవారికి స్వర్ణకిరీటం, వెండి పాదాలు బహూకరణ
తిరుమల, 2018, ఆగస్టు 27: తమిళనాడుకు చెందిన శ్రీ కన్నయ్య కుమారుడు శ్రీ దొరస్వామి యాదవ్ అనే భక్తుడు సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారికి స్వర్ణకిరీటం, వెండి పాదాలను కానుకగా సమర్పించారు. ఈ మేరకు ఈ కానుకలను తిరుమలలోని టిఎస్సార్ విశ్రాంతి గృహంలో టిటిడి ఛైర్మన్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ కు అందజేశారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, భక్తులు వివిధ రూపాల్లో కానుకలు సమర్పించి తమ భక్తిని చాటుకుంటున్నారని చెప్పారు. ఈరోజు తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తానికి చెందిన భక్తుడు శ్రీ దొరస్వామి యాదవ్ రూ. 28 లక్షలు విలువైన 1.10 కిలోలు బరువు గల బంగారు కిరీటం, రూ.2 లక్షలు విలువైన 1.60 కిలోల బరువు గల రెండు వెండి పాదాలను శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి బహూకరించారని వెల్లడించారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.