GRAND GOPUJA AT VASANTHA MANDAPAM _ వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా గోపూజ

Tirumala, 21 November 2021:As part of Karthika masa celebrations which included Vishnu Puja fete TTD organised the Go puja at Vasantha Mandapam on Saturday morning.

The festivities were live telecast by the SVBC channel between 08.30-10.00 am

In this connection the utsava idols followed by Thiru Aradhana of Sri Venugopal Swamy and his consorts Rukmini and Satyabhama were seated at Vasantha Mandapam where Karthika Vishnu puja Sankalp and Vishnu puja mantras were performed followed by Thiru Aradhana, Gopuja for cow and calf, naivedyam, harati and Go Pradakshina and others.

Earlier TTD Agama adviser Sri Mohan Rangacharyulu narrated the significance of the Go puja in Sanatana Hindu dharma and that it begot fruits of worship of a multitude of Gods.

The Chief Priests Sri Venugopal Dikshitulu, Sri Krishna Seshachala Dikshitulu, OSD Sri Pala Sheshadri and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా గోపూజ

తిరుమల‌, 2021 నవంబరు 21: కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా ఆదివారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో గోపూజ‌ శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఉద‌యం 8.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారిని వ‌సంత మండ‌పంలో కొలువుతీర్చారు. ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ సనాతన ధర్మంలో గోవుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, గోపూజ ముక్కోటి దేవతల పూజాఫలంతో సమానమని అన్నారు.

ముందుగా కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం చేసి ప్రార్థ‌నా సూక్తం, విష్ణుపూజా మంత్ర ప‌ఠ‌నం చేశారు. ఆ త‌రువాత స్వామి, అమ్మ‌వార్ల‌కు తిరువారాధ‌న చేశారు. అనంతరం ఆవు, దూడకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. గోప్ర‌ద‌క్షిణ చేశారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, ఓఎస్డి శ్రీ పాల శేషాద్రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.