GT POURNAMI GARUDA SEVA HELD _ వైభవంగా శ్రీ గోవింద రాజస్వామివారి పౌర్ణమి గరుడసేవ

TIRUPATI, 17 OCTOBER 2024: The monthly Pournami Garuda Seva was observed with spiritual fervour on Thursday evening in Sri Govindaraja Swamy temple at Tirupati.

The processional deity of Sri Govindaraja Swamy in all His splendour blessed the devotees on the Garuda Vahanam.

DyEO Smt Shanti and other temple staff, devotees were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా శ్రీ గోవింద రాజస్వామివారి పౌర్ణమి గరుడసేవ

తిరుపతి, 2024 అక్టోబ‌రు 17: తిరుపతి శ్రీ గోవింద రాజస్వామివారి పౌర్ణమి గరుడసే గురువారం వైభవంగా జరిగింది. సాయంత్రం 6 గంటలకు సర్వాలంకార భూషితుడైన స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

వాహన సేవలో డిప్యూటీ ఈఓ శ్రీమతి శాంతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.