GT POURNAMI GARUDA SEVA _ జూలై 21న శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

TIRUPATI, 19 JULY 2024: The monthly Pournami Garuda Seva will be observed in Sri Govindaraja Swamy temple on July 21.
 
In connection with Guru Pournami on Sunday, Sri Govindaraja Swamy will take a celestial ride on Garuda Vahanam to bless His devotees.
  
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 

జూలై 21న శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

తిరుపతి, 2024, జూలై 19: గురు పౌర్ణమి సందర్భంగా తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో జూలై 21న ఆదివారం గరుడసేవ జరుగనుంది.

ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన స్వామివారు గరుడునిపై మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.