GT PUSHPAYAGAM ANKURARPANAM ON JUNE 13 _ జూన్ 13న శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ
TIRUPATI, 12 JUNE 2024: The Ankurarpanam for the annual Pushpayagam in Sri Govindaraja Swamy temple will be held on June 13 from 6.30 pm to 8 pm in Tirupati.
As part of this, on June 14 from 9.30 am to 11 am, Snapana Tirumanjanam will be held for the utsavarulu of Sri Govinda Raja Swamy along with Sridevi Bhudevi.
Pushpa yagam will be held from 1 pm to 4 pm. In this, the deities are rendered floral bath with aromatic and traditional flowers, leaves like tulsi, pachchaku, chamanti, ganneru, mogali, jasmine, jaji, sampangi, roja etc.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జూన్ 13న శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ
తిరుపతి, 2024 జూన్ 12: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 14వ తేదీన జరగనున్న పుష్పయాగానికి జూన్ 13వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా జూన్ 14న ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవింద రాజ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేస్తారు.
మధ్యాహ్నం 1 నుండి 4 గంటల వరకు పుష్పయాగం వైభవంగా జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.