HANUMAN IS A ROLE MODEL TO SOCIETY-SRI CHAGANTI KOTESWARA RAO_ హనుమంతుడు శక్తిశాలి, బుద్ధిశాలి, త్యాగశీలి: బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Tirupati, 13 Jan 19:Lord Hanuman is an icon of all qualities of a good human being, said renowned spiritual scholar Brahmasri Chaganti Koteswara Rao.
Speaking on the topic Hanuadwaibhavam-Samaja Spurthi organised by Hindu Dharma Prachara Parishad wing of TTD at Mahati on Sunday evening, he said Hanuman is a complete human being personified with good qualities. He knew when to use intellectual, power and remain patient. These qualities are need to be developed by the children of today to lead a valuable life.
Huge number of devotees took part in this religious discourse.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
హనుమంతుడు శక్తిశాలి, బుద్ధిశాలి, త్యాగశీలి: బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
తిరుపతి, 13 జనవరి, 2019: హనుమంతుడు వాయువేగంతో వెళ్లగలిగే శక్తిశాలి, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగే బుద్ధిశాలి, నమ్మినవారి కోసం తన శక్తిని ఉపయోగించిన త్యాగశీలి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో హనుమద్వైభవం – సమాజ స్ఫూర్తి అనే అంశంపై ఆయన ధార్మిక ఉపన్యాసం చేశారు. సోమవారం కూడా ఈ ఉపన్యాస కార్యక్రమం ఉంటుంది.
ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉపన్యసిస్తూ విద్యను నేర్చుకోవడంలో ఆంజనేయుడు ఈతరం పిల్లలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఎక్కడ వినయం ప్రదర్శించాలో, ఎక్కడ ఓర్పుతో ఉండాలో, ఎక్కడ తన శక్తిని వాడాలో తెలిసిన మహనీయుడన్నారు. ఎంత బలవంతుడో అంత తగ్గిపోయే తత్వం, అవసరమైతే ప్రభువు కోసం అవమానాలను ఎదుర్కోవడం ఆయనకే సాధ్యమన్నారు. సీత ఆన్వేషణ కోసం తన శక్తిని బుద్ధిని ప్రదర్శించాడని చెప్పారు. భగవంతునిపై నమ్మకం ఉంచితే భయం లేకుండా జీవించడం సాధ్యమవుతుందన్నారు. హనుమకథ విన్నా శోధించినా ఆయనలోని గొప్పతనం అలవడుతుందని, అందుకే పిల్లలకు ఆంజనేయకథను చెబుతారని వివరించారు.
ఈ కార్యక్రమంలో హిందూధర్మప్రచార పరిషత్ అధికారులు , పెద్ద ఎత్తున తిరుపతి పుర ప్రజలు పాల్గొన్నారు.
టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.