HARIKATHA COMMENCES IN GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో హరికథా కార్యక్రమాలు ప్రారంభం

TIRUPATI, 01 JULY 2023: As a part of TTD’s motto of taking forward Hindu Santana Sharma Harikatha Parayanam commenced in Sri Govindaraja Swamy temple in Tirupati on Saturday.

Harikatha Bhagavatarini Smt Varalakshmi rendered Sundarakanda from Srimad Ramayanam in a mellifluous manner attracting devotees.

HDPP Secretary Sri Srinivasulu, DyEO smt Shanti and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో హరికథా కార్యక్రమాలు ప్రారంభం

తిరుపతి, 2023, జూలై 01: ధర్మప్రచారంలో భాగంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ ప్రాంగణంలో శనివారం నుండి హరికథా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆలయంలో హరికథా కార్యక్రమం నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా తొలిరోజు రామాయణంలో సుందరకాండ అనే అంశంపై భాగవతారిణి శ్రీమతి వరలక్ష్మి హరికథ వినిపించారు.

ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ శ్రీనివాసులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, డిపిపి ఏఈఓ శ్రీ శ్రీరాములు, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.