HIGHLIGHTS OF TIRUMALA NAVARATHRI BRAHMOTSAVAMS_ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ముఖ్యాంశాలు

Tirumala, 18 October 2018: The Navarathri Brahmotsavams concluded on a grand note in Tirumala on Thursday. Lakhs of pilgrims witnessed Vahana Sevas and had darshanam of Lord Venkateswara.

Highlights from each department recorded during Brahmotsavams in the last eight days (October 10 to 17) as follows:

SRIVARI TEMPLE

* 6.54 lakh devotees had darshan
* Record number of 1.03 lakh had darshan on Garuda Seva day
* 7 lakh laddus buffer stock kept
* 29.30 lakh laddus sold
* Hundi collections touched Rs.17.75 crores
*Vagapadi ( prasadams) revenue Rs.6.70crores
*Nearly 3 lakh devotees including locals got blessed on Garuda seva day.

SECURITY AND VIGILANCE:

*Security ith 750 CC cameras and bodyworn cameras on Garuda seva, Rathotsavam and Chakrasnanam day to avert untoward incidents.
*3000 police, 1000 more on Garuda seva day, provided ecurity during Brahmotsavams
* 800 Srivari Sevakulu, 700 Scouts and Guides, 200 NCC cadets, 400 home guards,300 TTD security guards, one NDRF unit, 25 swimmers served during the festival.
* Monitoring of all movements and happenings in Tirumala through a video wall at Command control center.
* 1.36 lakh child tags issued to avert missing issues.

ACCOMODATION:

* Record revenue of Rs.1.121 Crore for 8 days of Brahmotsavams
* 4000 rooms earmarked for common devotees daily.
* Occupancy rate stood at record 93 %
* Display board heralded room vacancies and allotments

KALYANA KATTA:

* 2.89 lakh devotees offer tonsuring to redeem their vows
* 1270 barbers including 270 women barbers render service.
* All the nine kalyana kattas worked on three shifts at 24 hours.

ANNA PRASADAMS

* 22 lakh devotees consumed meals for 8 days of Brahmotsavams
* 12.74 lakh units of coffee/tea/milk served
*Record 7.59 lakh devotees served anna Prasadams and snacks 5.19 lakh tea/coffee on Garuda seva day.
*Anna Prasadans provided at Tarigonda Vengamamba Anna Prasada Bhavan from early morning to 1.30 AM past midnight.
* 10 tons of vegetables donated by devotees daily

MEDICAL AND HEALTH:

* 45 doctors and 85 para medics served
* 46,371 devotees given medicare on foot paths and Tirumala

HEALTH WING:

* 3300 workers strived to clean toielts, streets and corridors of guest houses , mada streets etc .
* 41 additional toielts built for devotee convenience
* 120 ones of garbage clearbed on the Garuda seva day.

ENGINEERING DEPT:

* Mada street gallereis refurbished to accomodate 2 lakh devotees.
* Flexi boards, sign boards, route maps set up all over Tirumala for devotees .
* One crore litres of RO treated water filled in Swami Pushkarini for Chakra snanam and daily use by devotees.
*. Compact Bhajan Mandapas built on corners of Mada streets .
*R O water plants all over Tirumala
*Separate queue lines in Pushkarini for Chakrasnanam
Record 309.30 lakh gallons of water used during Brahmotsavanms
*Car and two wheeler parkings at Devlok, Alipiri, Srivari mettu etc.
* 116 Electric cut outsof Gods and goddesss, 23 electric arches
33LED screens all over Tirumala and Mada streets for devotees to watch Vahana sevas and Live SVBC programs on Temple rituals etc.

HDPP AND OTHER PROJECTS:

* Cultural and Dharmic wings of TTD- HDPP, Annamacharya ,Dasa Sahitya projects and SV Music and Dance college rolled out cultural activities – bhajans, bhakti sangeet, dances , discourses, nama sankeertans, Vishnu Sahasranamams, .
* 87 troupes and 3290 artists rendered programs during eight days of Brahmotsavams. .
* For the first time Sangeet Natak Academy from New Delhi also sponsored some teams and
Folk artists from Haryana, Maharashtra,Tamil Nadu, Kerala, Gujarat,

GARDEN DEPARTMENT:

* Grand flower decorations in the courtyard and inside Srivari temple.
* 50 tones of traditional flowers and 2.50 lakh cut flowers used.

PUBLIC RELATIONS DEPARTMENTS:

* Media center with computers, internet, fax and TV organised at Ram Bagicha-2
* Book stalls organised at Tirumala and in Tirupati organised for sale of CDs,DVDs,
* Rs.24.42 lakhs revenue generated in eight days of Brahmotsavams through the sale of TTD publications.
* Corodianted Brahmotsavams service activities with 4200 srivari sevakulu from all over India.
*.Srivari sevaks disbursed food, snacks, coffee, milk , butter milk at Mada streets and also Food courts besides Tarigonda Vengamamba Anna Prasadam complex.
Maha Pradarshan(Exhibition)
* Daily 40,000 foot falls at Exhibition.
* Ten feet idol of Sri Venkateswara was star attraction.

SV GOSAMRAKSHANA SHALA:

*.Brightly decorated Bulls, Horses and Elephants particiapted in the Vahana seva processions.
*Animal handlers appeared in bright uniforms and colorful umbrellas .
*Special veterinary experts and doctors brought for animal care during Vahana sevas

SVBC:

*Sri Venkateswara Bhakti Channel
broadcastEd 13-hour live programs
* Commentary in English, Telugu, Tamil, Kannada daily during Vahana sevas .
* Highlights of Brahmotsavams uploaded on YouTube, SVBC App ,TTD website .
* Sophisticated equipment used including 13 HD cameras, 3 jimmy jips , high density lenses etc. for live coverages

INFORMATION TECHNOLOGY:

* IT rolled out in security arrangements-CC cameras, Body wrap camers , public address system, traffic diversions etc.
* IT utilised in darshan, laddu and accomdoation allotments

APSRTC:

*APSRTC brought 3.64lakh devotees to Tirumala in 14,865 trips and took back 5.58 lakhs to Tirupati in 14,835 trips
* While on Garuda seva alone 80,239 in 2898 trips from Tirupati to Tirumala, 1.03 lakhs from Tirumala o Tirupati in 2740 trips

DISTRICT ADMINISTRATION SERVICES:

Police, Health, Revenue and other departments in the district offered services.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ముఖ్యాంశాలు

తిరుమల, 18 అక్టోబరు 2018: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు వైభవంగా జరిగాయి. తమిళులకు పవిత్రమైన పెరటాశినెల, దసరా సెలవులు రావడంతో విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి సంతృప్తికరంగా శ్రీవారి మూలమూర్తితోపాటు వాహనసేవలను దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, లడ్డూప్రసాదం, అన్నప్రసాదాలు, బస, భద్రత తదితర ఏర్పాట్లను టిటిడి చేపట్టింది. ఈ బ్రహ్మూెత్సవాల్లో అక్టోబరు 10 నుండి 17వ తేదీ వరకు 8 రోజుల పాటు నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీవారి ఆలయం :

– 6.54 లక్షల మంది భక్తులు శ్రీవారి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.

– గరుడసేవనాడు శ్రీవారి మూలమూర్తిని 1.03 లక్షల మంది దర్శించుకున్నారు.

– 7 లక్షల లడ్డూలు బఫర్‌ స్టాక్‌ ఉంచుకోవడమైనది.

– విక్రయించిన మొత్తం లడ్డూలు 29.30 లక్షలు

– హుండీ ఆదాయం రూ.17.75 కోట్లు.

– వగపడి ఆదాయం రూ.6.70 కోట్లు.

– స్థానికులతో కలిసి 3 లక్షల మందికిపైగా భక్తులు గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకున్నారు.

నిఘా మరియు భద్రతా విభాగం :

– వాహనసేవలు, రథోత్సవం, చక్రస్నానంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 750 సిసిటివిలు, బాడివోర్న్‌ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు.

– బ్రహ్మోత్సవాల రోజుల్లో 3 వేల మంది, గరుడసేవ నాడు అదనంగా 1000 మంది పోలీసులు భద్రతా విధులు నిర్వహించారు.

– 800 మంది శ్రీవారి సేవకులు, 700 మంది స్కౌట్స్‌, గైడ్స్‌, 200 మంది ఎన్‌సిసి క్యాడెట్లు, 400 మంది హోంగార్డులు, 300 మంది టిటిడి సెక్యూరిటీ గార్డులు, ఒక ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందం, 25 మంది గజ ఈతగాళ్లు భక్తులకు సేవలందించారు.

– కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని వీడియో వాల్‌ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లోని భద్రతను పర్యవేక్షించాం.

– చిన్నపిల్లలు తప్పిపోకుండా 1.42 లక్షల జియోట్యాగ్‌లు.

విడిది విభాగం :

– భక్తులకు వసతి కల్పించడం వలన బ్రహ్మూెత్సవాల్లో 8 రోజులకు గాను టిటిడికి వచ్చిన ఆదాయం రూ.1.21 కోట్లు

– సామాన్య భక్తులకు అందుబాటులో ప్రతిరోజూ 4 వేల గదులు.

– ఆక్యుపెన్సీ రేటు 93 శాతంగా నమోదైంది.

– గదుల లభ్యత సమాచారాన్ని డిస్‌ప్లే బోర్డుల ద్వారా తెలియజేశాం.

కల్యాణకట్ట :

– తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 2.89 లక్షలుగా నమోదైంది.

– 279 మంది మహిళా క్షురకులతో కలిపి మొత్తం 1270 మంది క్షురకులు 9 కల్యాణకట్టల్లో రోజుకు మూడు షిప్టుల్లో 24 గంటల పాటు భక్తులకు ఉచితంగా తలనీలాలు తీయడం జరిగింది.

అన్నప్రసాదం :

– బ్రహ్మోత్సవాల 8 రోజుల్లో 22 లక్షల భోజనాలు, అల్పాహారం అందించడమైనది.

– 12.74 లక్షల యూనిట్ల పాలు/టీ/కాఫి భక్తులకు అందించడమైనది.

– గరుడసేవనాడు ఒకే రోజు 7.59 లక్షల మందికి అన్నప్రసాదాలు, అల్పాహారం, 5.19 లక్షల మందికి టి, కాఫి, పాలు, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 2.41 లక్షల తాగునీటి బాటిళ్లు అందించడం జరిగింది.

– గరుడసేవనాడు తెల్లవారుజామున 1.30 గంటల వరకు భక్తులకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం పంపిణీ.

– ప్రతిరోజూ 10 టన్నుల కూరగాయలను దాతలు విరాళంగా అందించారు.

వైద్యం :

– బ్రహ్మోత్సవాలకు అదనంగా 45 మంది డాక్టర్లు, 85 మంది పారామెడికల్‌ సిబ్బందిని వినియోగించడమైనది.

– తిరుమల, నడకదారుల్లో 46,371 మంది భక్తులకు వైద్యసేవలు.

ఆరోగ్య విభాగం :

– బ్రహ్మోత్సవాల్లో ఆలయ నాలుగు మాడవీధులు, కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయాలు, సామూహిక మరుగుదొడ్ల వద్ద మెరుగైన పారిశుద్ధ్యం కోసం 3300 మంది సిబ్బంది సేవలను వినియోగించడమైనది.

– భక్తుల సౌకర్యార్థం తిరుమలలో అదనంగా 41 మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకొచ్చాం.

– గరుడసేవనాడు 120 టన్నుల చెత్త తొలగింపు.

ఇంజనీరింగ్‌ విభాగం :

– దాదాపు 2 లక్షల మంది భక్తులు కూర్చొని వాహనసేవలు వీక్షించేందుకు వీలుగా గ్యాలరీలు ఏర్పాటు.

– భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో సూచికబోర్డు, ఫ్లెక్సీలు, రూట్‌మ్యాప్‌లు.

– ఒక కోటి లీటర్ల శుద్ధి చేసిన నీటిని శ్రీవారి పుష్కరిణిలో నింపడమైనది.

– వాహనాలు తిరిగే నాలుగు మాడ వీధుల కూడళ్లలో భజన మండపాలు ఏర్పాటు. వివిధ ప్రాంతాల్లో ఆర్‌ఓ తాగునీటి ప్లాంట్లు.

– చక్రస్నానం కోసం పుష్కరిణిలో ప్రత్యేక క్యూలైన్లు.

– బ్రహ్మోత్సవాల్లో 309.30 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం. రోజుకు సరాసరి 38.66 లక్షల గ్యాలన్లు.

– తిరుపతిలోని దేవలోక్‌, శ్రీవారిమెట్టు, అలిపిరి వద్ద కార్లు, ద్విచక్రవాహనాలకు పార్కింగ్‌ వసతి.

– భక్తులను ఆకర్షించే రీతిలో దాదాపు 116 దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్లను రూపొందించారు. 23 ఆర్చిలను ఏర్పాటుచేశారు.

– మాడ వీధులతో పాటు వివిధ ప్రాంతాల్లో భక్తులు వాహనసేవలను వీక్షించేందుకు వీలుగా 33 ప్రాంతాల్లో ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు.

– కళాబృందాల కోసం ఆధునిక టెక్నాలజీతో యూనిఫాం సౌండ్‌ సిస్టమ్‌.

హిందూ ధర్మప్రచార పరిషత్‌, ఇతర ప్రాజెక్టులు :

– శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొత్తం హిందూధర్మప్రచార పరిషత్తు, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో 87 కళాబృందాల్లో 3,290 మంది కళాకారులు వివిధ రకాల ప్రదర్శనలిచ్చారు.

– ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్‌, హర్యానా, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల కళాకారులు వాహనసేవల ముందు, తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలో ప్రదర్శించిన కళాకృతులు విశేషంగా అకట్టుకున్నాయి.

– ఈ వేదికలపై ప్రముఖ కళాకారులు శ్రీమతి కౌసల్య, శ్రీమతి ఉష, శ్రీకొమండూరి రామాచారి, శ్రీ అయ్యకుడి అనంతకృష్ణ, మాస్టర్‌ వి.రాహుల్‌ తదితరులు సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించారు.

ఉద్యానవన విభాగం :

– శ్రీవారి ఆలయంలో శోభాయమానంగా పుష్పాల అలంకరణలు.

– పౌరాణిక అంశాలతోపాటు రంగురంగుల పుష్పాలతో పుష్పప్రదర్శనశాల. వామనావతారం, పాలకడలిలో విష్ణుమూర్తి సైకత శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

– పలు కూడళ్లు, అతిథిగృహాల వద్ద పుష్పాలంకరణలు.

– బ్రహ్మోత్సవాల్లో సాంప్రదాయ పుష్పాలు 50 టన్నులు, 2.50 లక్షల కట్‌ ఫ్లవర్స్‌ వినియోగం.

ప్రజాసంబంధాల విభాగం :

– తిరుమలలోని రాంభగీచా-2లో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్‌లో ఫోను, ఇంటర్నెట్‌ వసతి కల్పించడం వలన మీడియా ప్రతినిధుల ద్వారా బ్రహ్మోత్సవానికి తగిన ప్రచారం కల్పించడం జరిగింది.

– భక్తుల కోసం తిరుపతి, తిరుమలలో పుస్తక విక్రయశాలలు ఏర్పాటు. సి.డిలు, డి.వి.డిలు, వివిధ భాషల ఆధ్యాత్మిక పుస్తకాలను భక్తులకు అందుబాటులో ఉంచడమైనది.

– టిటిడి ప్రచురణల విక్రయం : రూ.41.10 లక్షలు.

– బ్రహ్మోత్సవాల వాహనసేవలు, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు ప్రత్యేక కథనాలకు సంబంధించి ప్రతిరోజూ 10 నుండి 15 వరకు పత్రికా ప్రకటనలను ఈ-మెయిల్‌, వెబ్‌ ఫార్మాట్‌, వాట్సాప్‌ ద్వారా పత్రికలు, ఛానళ్లకు అందించడం జరిగింది.

– దేశం నలుమూలల నుండి విచ్చేసిన 4200 మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు.

– శ్రీవారి సేవకుల ద్వారా గరుడసేవనాడు ఆహారపొట్లాల తయారీ. మాడ వీధులతోపాటు క్యూలైన్లలోని భక్తులకు శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ద్వారా అన్నప్రసాదం, మజ్జిగ, తాగునీరు పంపిణీ.

మహాప్రదర్శన :

– తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ”మహాప్రదర్శన” పేరిట ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఫలపుష్పప్రదర్శన, ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఛాయాచిత్ర ప్రదర్శనతోపాటు ఎస్వీ మ్యూజియం, ఆయుర్వేద కళాశాల, శిల్పకళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనలను ఒక లక్షా యాభై వేల మందికి పైగా భక్తులు సందర్శించారు.

ఎస్వీ గోసంరక్షణశాల :

– శ్రీవారి వాహనసేవల్లో సర్వాంగసుందరంగా ముస్తాబు చేసిన ఏనుగులు, అశ్వాలు, వృషభాల వినియోగం.

– జంతువుల సహాయకులు ప్రత్యేక వస్త్రధారణలో గొడుగులతో వాహనసేవలకు మరింత వన్నె తెచ్చారు.

– జంతువుల వద్ద నైపుణ్యం గల శిక్షకుల ఏర్పాటు.

శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ :

– శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని భక్తుల కళ్లకు కట్టేలా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో రోజుకు 13 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారాలు.

– వాహనసేవల విశిష్టత అన్ని భాషల వారికి తెలిసేందుకు వీలుగా ప్రముఖ పండితులతో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వ్యాఖ్యానాలు.

– బ్రహ్మోత్సవాల విశేషాలను యుట్యూబ్‌, ఎస్వీబీసీ యాప్‌, టిటిడి వెబ్‌సైట్‌ ద్వారా భక్తులకు అందించాం.

– అధునిక సాంకేతిక పరిజ్ఞానం గల 14 హెచ్‌డి కెమెరాలు, 3 జిమ్మి జిప్‌లతోపాటు నిపుణులైన కెమెరామెన్లను ఉపయోగించడమైనది.

ఐటి :

– టిటిడి ఐటి విభాగం అధునాతన పరిజ్ఞానంతో వేగవంతమైన సేవలందించడం ద్వారా భక్తులు దర్శనం, వసతి ఇతర సేవలను మరింత సౌకర్యవంతంగా పొందగలిగారు.

ఎపిఎస్‌ఆర్‌టిసి :

– ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు 14,865 ట్రిప్పుల్లో 3.64 లక్షల మంది భక్తులను చేరవేశాయి. తిరుమల నుంచి తిరుపతికి 14,834 ట్రిప్పుల్లో 5.58 లక్షల మంది భక్తులను చేరవేశాయి.

– గరుడసేవనాడు ఆర్‌టిసి బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు 2,898 ట్రిప్పుల్లో 80,239 మంది భక్తులను చేరవేశాయి. తిరుమల నుంచి తిరుపతికి 2,740 ట్రిప్పుల్లో 1.03 లక్షల మంది భక్తులను చేరవేశాయి.

జిల్లా యంత్రాంగం సేవలు :

– టిటిడి విభాగాలతోపాటు జిల్లా యంత్రాంగం, పోలీసు, ఎన్‌డిఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక విభాగాలు, ఎపిఎస్‌పిడిసిఎల్‌, ఎపిఎస్‌ఆర్‌టిసి, ఆర్‌టిఓ, వైద్య, ఆరోగ్యశాఖల అధికారులు, సిబ్బంది బ్రహ్మూెత్సవాల్లో భక్తులకు విశేష సేవలందించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.