HOTEL LICENSE CANCELED _ తిరుమల బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ రద్దు

TIRUMALA, 18 JULY 2024: The Licence of the Hotel Balaji Bhavan near Koustubham which comes under the fold of one among the nine big canteens in Tirumala was cancelled on Thursday.

The Hotel was issued the final notice in the month of June. The current pending licence fee lying with the hotel is to the tune of Rs.76,04,196.

While cancelling the licence of the hotel for not paying licence fees promptly, the Task Force comprising Revenue, Health and Vigilance officials have taken over the possession of the Hotel. 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ రద్దు

తిరుమల, 2024 జూలై 18: లైసెన్స్ ఫీజు సకాలంలో చెల్లించని కారణంగా తిరుమలలోని తొమ్మిది పెద్ద హోటల్ (కాంటీన్)లలో ఒకటైన, కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలోని బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ ను టీటీడీ రద్దు చేసింది.

ప్రస్తుతం హోటల్ చెల్లించవలసిన లైసెన్స్ ఫీజు రూ.76,04,196. ఇందుకు సంబంధించి జూన్ నెలలో సదరు హోటల్‌కు తుది నోటీసులు జారీ చేయడమైనది.

పలుమార్లు నోటీసులు జారీ చేసినా, లైసెన్సు ఫీజు చెల్లించనందుకు హోటల్ లైసెన్స్‌ను రద్దు చేసి, టీటీడీ రెవెన్యూ, హెల్త్, విజిలెన్స్ అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్ బృందం గురువారం హోటల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.