IMPRESSIVE MUSIC AND DANCE PROGRAMS AT SRI KAPILESWARA SWAMY BRAHMOTSAVAM _ శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లోఆకట్టుకున్న సంగీత, నృత్య కార్యక్రమాలు
శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లోఆకట్టుకున్న సంగీత, నృత్య కార్యక్రమాలు
తిరుపతి, 2025 ఫిబ్రవరి 19: శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన బుధవారం రాత్రి శ్రీ వెంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై నాదస్వర, డోలు కచేరి అలరించింది. ఇందులో శ్రీ మునిరత్నం, శ్రీ కృష్ణమూర్తి బృందం నాదస్వరం, శ్రీ కృష్ణారావు, శ్రీ కృష్ణమూర్తి బృందం నాదస్వరం కచేరి చేశారు. అదేవిధంగా కళాశాల అధ్యాపకురాలు డా. వందన బృందం గాత్ర కచేరి వీనులవిందుగా సాగింది. అనంతరం కళాశాల అధ్యాపకులు శ్రీ రవికుమార్ బృందం “కూచిపుడి” ప్రదర్శన వీక్షకులను అలరించింది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.