Inauguration of ARCHAKA TRAINING PROGRAMME FOR ARCHAKAS from KARANATAK State _ అర్చక విధానంలో పునశ్చరణ తరగతులు 

Tirupati, 02 June 2009: Dr K.V.Ramanachary, Executive Officer, TTDs inaugurated the week-long training programme for the Archakas from Karnataka State at SEVTA Bhavan, Tirupati on Tuesday morning.
 
Dr Vedantham Vishnu Bhattacharyulu, Co-ordinator of this programme, 45 archakas from Karnataka state have participated in this programme.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అర్చక విధానంలో పునశ్చరణ తరగతులు

తిరుపతి, జూన్‌-2,  2009: అర్చక విధానంలో ఎలాంటి లోపాలు యుండకూడదనే సదుద్దేశంతో రాష్ట్రంలో వివిధ దేవాలయాలలో పూజలు నిర్వహించే అర్చకులతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అర్చకులకు కూడా అర్చక విధానంలో పునశ్చరణ తరగతులు తిరుమల తిరుపతి దేవస్థానం శ్వేత ఆధ్వర్యంలో నిర్వహిస్తోందని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ కె.వి.రమణాచారి తెలిపారు. మంగళవారంనాడు ‘శ్వేత’ భవనంలో కర్నాటక రాష్ట్రానికి చెందిన అర్చకులకు వైఖానస ఆగమ విధానంలో యేర్పాటు చేసిన శిక్షణాకార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం పురాతన సంప్రదాయాలను, పూజావిధానాలను, దైవిక సంబంధమైన అన్ని పద్దతులను పరిరక్షించడానికి అవిరళకృషి చేస్తోందని అన్నారు. ఇంతవరకు, వెయ్యిమందికి పైగా అర్చకులకు పునశ్చరణ తరగతులు యేర్పాటుచేశామని, గిరిజనులకు, మత్సకారులకు కూడా పూజావిధానంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించామని ఆయన తెలిపారు.

ప్రతి వ్యక్తి భారతీయ సంప్రదాయాలను కాపాడటానికి కృషి చేయాలని, పదకవితా పితామహుడు అన్నమయ్య చిన్న పిల్లలకు కూడా మహత్తరమైన జోలపాటలు రచించడాని, భారతీయత ఉట్టిపడే అలాంటి పాటలను కొంత మంది మర్చిపోయి సినిమాపాటలను చిన్నపిల్లలకు వినిపిస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రపంచదేశాలు భారత సంప్రదాయాలకు, విలువలకు యెంతో విలువ ఇచ్చి గౌరవిస్తాయని, వాటిని నిర్లక్ష్యం చేస్తే రాబోయేతరాలకు ఎనలేని నష్టం జరుగుతుందని  శ్రీ కె.వి.రమణాచారి అన్నారు.

ఆగమశాస్త్ర, అర్చక విధానానికి సంబంధించిన పునశ్చరణ తరగతుల పర్యవేక్షకులు డా||విష్ణుభట్టాచార్యులు కూడా ప్రసంగించారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన శ్రీ కృష్ణమాచర్యులు,    శ్రీ శ్రీనివాసచార్యులు మాట్లాడుతూ, శిక్షణా తరగతులు అర్చకులకు ఎంతో ఉపయోగ పడ్తాయని అన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.