JAYANTHI OBSERVED _ ఘనంగా శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 131వ జయంతి
Tirupati, 17 Dec. 20: The 131st birth anniversary of renowned scholar, epigraphist and first Peishkar of Tirumala temple Sri Sadhu Subramanya Shastri was observed in Tirupati on Thursday.
Sri Shastri unravelled the glorious past of the Tirumala Temple by translating the rock and copper inscriptions.
SVETA Director Ramanujulu Reddy, HDPP co-option member Sri Penchalaiah, AEO Smt Jagadishwari, Higher Vedic Studies incharge Dr Vibhishana Sharma and others offered floral tributes and garlanded the bronze statue of Sadhu Subramanyam Shastri located in front of the SVETA (Sri Venkateswara Employees Training Academy) Bhavan.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఘనంగా శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 131వ జయంతి
తిరుపతి, 2020 డిసెంబరు 17: ప్రముఖ పండితుడు, ఎపిగ్రఫిస్టు, శ్రీవారి ఆలయ మొదటి పేష్కార్ అయిన శ్రీమాన్ సాధు సుబ్రమణ్యశాస్త్రి 131వ జయంతి గురువారం తిరుపతిలో ఘనంగా జరిగింది.
శ్రీ సుబ్రమణ్యశాస్త్రి తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేశారు. అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి చాలా రాగి రేకులను వెలికితీసి కీర్తనలను వెలుగులోకి తెచ్చారు.
ఈ సందర్భంగా శ్వేత భవనం ఎదురుగా గల సుబ్రమణ్యశాస్త్రి కాంస్య విగ్రహానికి శ్వేత సంచాలకులు డా. రామాంజులరెడ్డి, హెచ్ డిపిపి కో ఆప్షన్ సభ్యుడు శ్రీ పెంచలయ్య, ఏఇఓ శ్రీమతి జగదీశ్వరి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. విభీషణ శర్మ పుష్పాంజలి ఘటించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.