SPIRITUAL LOOK TO TTD AD BUILDING_ టిటిడి పరిపాలనా భవనానికి ఆధ్యాత్మిక రూపు : జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
Tirupati, 12 Mar. 19: The Tirumala Tirupati Devasthanams administrative building will be given spiritual look with necessary structural modifications, said, Tirupati JEO Sri B Lakshmikantham.
On Tuesday morning, the JEO inspected various departments in
the administrative building. He said, the images of deities of Tirumala and other temples will be placed at all the corridors to enhance spiritual feeling among employees to serve pilgrims in a better way.
The special platform will be arranged for the sake of devotees and visitors wherein the senior officers will resolve the issues by directly contacting the devotees and visitors.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
టిటిడి పరిపాలనా భవనానికి ఆధ్యాత్మిక రూపు : జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
మార్చి 12, తిరుపతి, 2019: తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనానికి ఆధ్యాత్మిక రూపు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. జెఈవో మంగళవారం టిటిడి పరిపాలనా భవనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ పరిపాలనా భవనానికి పెయింటింగ్‌తోపాటు భక్తులు, సందర్శకుల కోసం ప్రయోగాత్మకంగా ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తామన్నారు. కింది అంతస్తులో ఈశాన్యమూలలో ఈ వేదికను ఏర్పాటుచేసి ఉన్నతాధికారులు భక్తుల వద్దకే వచ్చి సూచనలు, సలహాలు, ఫిర్యాదులు స్వీకరించేలా ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. ఉద్యోగులు మరింత సౌకర్యవంతంగా విధులు నిర్వహించేందుకు వీలుగా ఒక నమూనా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని, మంచి ఫలితాలు వస్తే పరిపాలనా భవనం మొత్తం ఇదే తరహాలో కార్యాలయాలను ఏర్పాటుచేస్తామని వివరించారు. ఉద్యోగుల్లో మరింత భక్తిభావం పెంచేలా పరిపాలనా భవనంలోని కారిడార్లలో తిరుమల శ్రీవారి ఆలయం, స్థానికాలయాలు, ఇతర ప్రాంతాల్లోగల ఆలయాలు, దేవతామూర్తులకు సంబంధించిన చిత్రపటాలను లైటింగ్‌తో ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.
జెఈవో వెంట టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్ఇ-1 శ్రీ రమేష్‌రెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.