JEO REVIEWS ON ARRANGEMENTS FOR UPCOMING EVENTS_ టిటిడిలో జాతీయ నాయకుల జయంతి వేడుకల నిర్వహణపై జెఈవో సమీక్ష
Tirupati, 20 Mar. 19: TTD Joint Executive Officer Sri B Lakshmi Kantham on Wednesday reviewed the preparations on birth anniversary celebrations of national leaders in the month of April.
Addressing the meeting at Sri Padmavathi Rest House in Tirupati, he directed officials to make all arrangements for Jayanthis of Jagjivan Ram (April5), Mahatma Jyotirao Phule (April 11), Dr BR Ambedkar (April 14), for grand celebrations in the TTD.
He also directed officials to organise quiz, essay writing and Fancy dress competitions for children of employees as a part of Ugadi celebrations.
He also reviewed the functioning of Parakamani and employees canteens and asked department heads to resolve employee’s grievances as and when brought to their notice. He also appointed the editor as in charge of grievances wing in Spthagiri Magazine and urged that all steps be taken to deliver the magazine in time to devotees and directed the chief editor Dr Radha Ramana to enhance the magazine circulation by another one-lakh copies.
The JEO asked officials to prepare an action be made to deliver 2020 calendars and diaries at all TTD information centres across the country and also promote their online booking. He instructed officials to enhance the greenery on TTD managed roads in Tirupati and also urged officials to study other projects elsewhere to beautify the Sri Ramam project underway at Alipiri and Vontimetta.
JEO meet on Employees grievances
The JEO later held a meeting on grievances of Women and SC/ST employees. On their demands for a separate sports complex for women, exempt them from night duties and transportation for women employees from long distance areas the JEO said he would review and take favourable action.
Chief Engineer Sri Chandrasekhar Reddy, DFO Phani Kumar Naidu, DyEOs Sri Vijay Kumar, Smt Kasturi and Snehalata and Sri Ashok Kumar Goud and others participated.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
టిటిడిలో జాతీయ నాయకుల జయంతి వేడుకల నిర్వహణపై జెఈవో సమీక్ష
తిరుపతి, 2019 మార్చి 20: టిటిడిలో ఏప్రిల్ నెలలో జాతీయ నాయకుల జయంతి వేడుకల నిర్వహణపై తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం బుధవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఏప్రిల్ 5న జగజ్జీవన్‌రామ్ జయంతి, 11న మహాత్మా జ్యోతిరావ్‌పూలే జయంతి, 14న డా..బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 6న ఉగాది వేడుకల నిర్వహణకు చక్కటి ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఉగాది సందర్భంగా ఉద్యోగులకు, వారి పిల్లలకు క్విజ్, వ్యాసరచన, వేషధారణ తదితర పోటీలు నిర్వహించాలన్నారు.
అనంతరం ఉద్యోగుల పరకామణి విధుల నిర్వహణ, ఉద్యోగుల క్యాంటీన్‌లో సౌకర్యాలు తదితర అంశాలపై జెఈవో సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పరిష్కరించాలని జెఈవో సూచించారు. సప్తగిరి మాసపత్రికకు సంబంధించి ఎడిటర్ కార్యాలయంలో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసి ఎడిటర్‌ను ఇన్‌చార్జిగా నియమిస్తామన్నారు. పాఠకులకు సకాలంలో పత్రిక అందేలా ఈ విభాగం పని చేస్తుందన్నారు. సప్తగిరి మాసపత్రిక సర్కులేషన్‌ను మరో లక్ష కాపీలు పెంచేలా చర్యలు చేపట్టాలని ప్రధాన సంపాదకులు డా.. రాధారమణను ఆదేశించారు.
2020 టిటిడి డైరీలు, క్యాలెండర్లను భక్తులకు సకాలంలో అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందించాలని జెఈవో ఆదేశించారు. దేశంలోని టిటిడి సమాచార కేంద్రాల్లో డైరీలు, క్యాలెండర్లను అందుబాటులో ఉంచి, ఆయా ప్రాంతాల వారు అక్కడినుండి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేలా తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. తిరుపతిలో టిటిడి నిర్వహిస్తున్న రోడ్లలో పచ్చదనం మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతిలోని అలిపిరి వద్ద శ్రీధామం, ఒంటిమిట్టలో శ్రీరామం ప్రాజెక్టులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లి అధ్యయనం చేయాలన్నారు.
టిటిడి ఉద్యోగుల వినతులపై జెఈవో సమావేశం
అనంతరం టిటిడిలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగుల వినతులపై జెఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని, రాత్రి విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని పలువురు మహిళా ఉద్యోగులు కోరారు. దూర ప్రాంతాల నుండి వచ్చే మహిళా ఉద్యోగులకు రవాణా వసతి కల్పించాలన్నారు.
అనంతరం జెఈవో మాట్లాడుతూ ఉద్యోగుల వినతులను పరిశీలించేందుకు ఇకపై ప్రతినెలా రెండు సార్లు సమావేశం నిర్వహిస్తామన్నారు. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే సంస్థ మరింత ఉన్నతస్థితికి చేరుకుంటుందన్నారు. ఉద్యోగుల వినతులపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సమావేశంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్ నాయుడు, డెప్యూటీ ఈవోలు శ్రీ విజయకుమార్, శ్రీమతి కస్తూరి, శ్రీమతి స్నేహలత, విజివో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్ పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.