JEO (H&E) REVIEWS KARTHIKA DEEPOTSAVAM ARRANGEMENTS _ కార్తీక దీపోత్సవం ఏర్పాట్లపై జెఈవో స‌మీక్ష‌

TIRUPATI, 15 NOVEMBER 2023: TTD JEO for Health and Education Smt Sada Bhargavi reviewed the arrangements for the upcoming festivities of Karthika Deepotsavams lined up to be observed in the major places next week onwards.

 

The meeting took place at Sri Padmavati Rest House on Wednesday afternoon. After the review meeting with all the departments, the JEO said like in the previous years, this year TTD is also organising the sacred Karthika Deepotsavams starting from November 20 in Tirupati followed by Kurnool on November 27 and Visakhapatnam on December 11.

 

She said in Tirupati, the religious event will take place in the Parade Grounds behind the TTD Administrative Building while in Kurnool in APSP Grounds and Vizag opposite Sri Kalimata temple in the famous RK Beach.

 

She said, since the last two years, TTD has been observing this mega-religious fete in a big way involving thousands of devotees with the support of local donors. “This year we are anticipating 2000 in Tirupati and 3000 each in the other two places based on the capacity of the venues”, she added.

 

Earlier during the review meeting she directed the officials concerned to make elaborate arrangements for the forthcoming event in Tirupati next Monday. “TTD is giving the live coverage of the event through SVBC for the benefit of global devotees. The event starts at 5:30pm with Veda Swasti followed by Deepa Prasastyam, TTD Chairman message, Vishwaksena Puja, Punyahavachanam, Vishnu Sahasranamam, Maha Lakshmi Puja, Deepa Lakshmi dance ballet, Govinda Namams and closes by 8:30pm with Kumbha Harati.

 

She also designated the Nodal Officers, supervisors and anchors for the events and directed the All Projects Program officer to coordinate between the departments ensuring smooth conduct of the events.

 

One of the Chief Priests of Tirumala temple Sri Venugopala Deekshitulu, CEO SVBC Sri Shanmukh Kumar, SE 2 Sri Jagadeeshwar Reddy, DyEOs Sri Lokanatham, Sri Subramanyam, VGO Sri Bali Reddy, Program Officer Sri Rajagopal, Deputy Forest Officer of TTD Sri Srinivas, Dy Director of TTD Garden Sri Srinivasulu, Special Officer Dr Vibhishana Sharma, representatives from SV College of Music and Dance, HDPP and others were also present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

కార్తీక దీపోత్సవం ఏర్పాట్లపై జెఈవో స‌మీక్ష‌

తిరుప‌తి, 2023 నవంబరు 15: ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో న‌వంబ‌రు 20 నుండి ప‌లు ప్రాంతాల్లో నిర్వహించ‌నున్న‌ కార్తీక దీపోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ  జెఈవో శ్రీమతి సదా భార్గవి సమీక్ష నిర్వ‌హించారు. తిరుప‌తిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో బుధవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరిగింది.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ గత ఏడాది త‌ర‌హాలోనే నవంబర్ 20న‌ తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవనం వెనుక ఉన్న పరేడ్ గ్రౌండ్స్‌లో కార్తీక దీపోత్సవాలను ప్రారంభిస్తామ‌ని, నవంబర్ 27న కర్నూలులోని ఎపిఎస్‌పి గ్రౌండ్స్‌లో, డిసెంబర్ 11న విశాఖ‌లోని ఆర్‌కె బీచ్‌లో గ‌ల‌ శ్రీ కాళీమాత ఆలయానికి ఎదురుగా దీపోత్స‌వాలు నిర్వహిస్తామ‌ని తెలిపారు. రెండేళ్లుగా దాతల సహకారంతో దీపోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నామ‌ని, ఈ ఏడాది తిరుపతిలో 2 వేల మంది, మిగిలిన రెండు చోట్ల 3 వేల మందిని అంచనా వేస్తున్నామని చెప్పారు.

తిరుపతిలో నిర్వ‌హించే దీపోత్స‌వానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జెఈవో ఆదేశించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఎస్వీబీసీ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రత్యక్ష ప్రసారం  చేస్తుంద‌న్నారు. సాయంత్రం 5.30 గంటలకు వేద స్వస్తితో దీపోత్స‌వం ప్రారంభమవుతుంద‌ని,  అనంతరం దీప ప్రశస్తి, టీటీడీ ఛైర్మన్ సందేశం, విష్వ‌క్సేన పూజ, పుణ్యాహవచనం, విష్ణుసహస్రనామ పారాయ‌ణం, మహాలక్ష్మీ పూజ, దీప లక్ష్మి నృత్య‌రూప‌కం, గోవిందనామాలు, చివ‌ర‌గా కుంభ హారతితో రాత్రి 8.30 గంటలకు ముగుస్తుంద‌ని వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ కోసం నోడల్ అధికారులు, ప‌ర్య‌వేక్ష‌ణ అధికారులు, వ్యాఖ్యాత‌ల‌ను జెఈవో నియమించారు. కార్య‌క్ర‌మం సజావుగా జ‌రిగేలా అన్ని విభాగాల‌తో సమన్వయం చేసుకోవాలని ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ అధికారిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ‌వారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒక‌రైన‌ శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, ఎస్‌ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ సుబ్రహ్మణ్యం, విజివో శ్రీ బాలిరెడ్డి, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ అధికారి శ్రీ రాజగోపాల్, డెప్యూటీ సిఎఫ్ శ్రీ శ్రీనివాస్, ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు డాక్టర్ విభీషణ శర్మ, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, హెచ్‌డీపీపీ అధికారులు  పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.