TIRUPATI JEO INSPECTIONS_ తిరుపతి జెఈవో తనిఖీలు

Tirupati, 14 Jun. 19: TTD Joint Executive Officer Sri B Lakshmi Kantham today made spot inspections at Srivari model temple near Alipiri in Tirupati, and senior officers quarters behind TTD administrative building on Friday evening and gave several directions to engineering and electrical department officials.

At the model Srivari temple near Alipiri, he directed officials to promote green landscape and additional painting wherever needed.

Inspecting the senior officers quarters he enquired about the number of quarters, occupancy and directed officials to ensure against drinking water shortages and power cuts.

TTD SE Sri Ramesh Reddy, EE s Sri Nageswar Rao, Sri Venkatakrishna Reddy and others accompanied him.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుపతి జెఈవో తనిఖీలు

జూన్ 14, తిరుపతి, 2019: తిరుపతి అలిపిరి సమీపంలోని శ్రీవారి నమూనా ఆలయం, పరిపాలన భవనం వెనుకవైపు ఉన్న సీనియర్ ఆఫీసర్స్ క్వార్టర్స్ లలో శుక్రవారం సాయంత్రం టిటిడి తిరుపతి జెఈవో శ్రీబి.లక్ష్మీకాంతం తనిఖీలు నిర్వహించారు.

శ్రీవారి నమూనా ఆలయం వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి నమూనా ఆలయం చుట్టూ పచ్చదనం ఉండేలా మొక్కలను పెంచాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట్ల పెయింటింగ్ వేయాలన్నారు. అనంతరం పరిపాలన భవనం వెనుక వైపు ఉన్న సీనియర్ ఆఫీసర్స్, స్పెషల్ సీనియర్స్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో తాగునీటి కొరత, విద్యుత్‌ కోత లేకుండా చూడాలన్నారు. క్వార్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత మంది నివాసం ఉంటున్నారు. ఖాళీగా ఎన్ని ఉన్నాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జెఈవో వెంట టిటిడి ఎస్ ఈ 1 శ్రీ రమేష్ రెడ్డి, ఈఈలు శ్రీ నాగేశ్వర రావు, శ్రీ వెంకటకృష్ణారెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.