JEO INSPECTS ARRANGEMENTS IN VONTIMITTA _ ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణ వేదిక ప‌రిశీలించిన‌ జేఈవో  శ్రీ వీరబ్రహ్మం

Vontimitta, 18 March 2023: In connection with annual brahmotsavams at Vontimitta Sri Kodandaramalayam scheduled to commence from March 30 onwards, JEO Sri Veerabrahmam inspected the ongoing works with other officials on Saturday.

As part of it, he also inspected the Kalyana Vedika where the state festival of Sri Sita Rama Kalyanam is set to take place on April 5.

Speaking to the media the JEO said, the works are going on a fast pace in Vontimitta as per our plan. TTD EO Sri AV Dharma Reddy will hold a review meeting over arrangements with the TTD and district officials on Sunday.

“Prior to it today we inspected and the arrangements to be made for Annaprasadam, buttermilk, water distribution, security arrangements at CM camping place, temple, kalyana vedika, engineering works etc., he added.

CE Sri Nageswara Rao, SVBC CEO Sri Shanmukh Kumar, Catering Special Officer Sri Shastry and other officials were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణ వేదిక ప‌రిశీలించిన‌ జేఈవో  శ్రీ వీరబ్రహ్మం
 
తిరుపతి 2023 మార్చి 18: శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 5వ తేదీన జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు వేగవంతం చేయాలని  టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. క‌ల్యాణ‌ వేదిక వ‌ద్ద జరుగుతున్న ఏర్పాట్లను శనివారం ఆయన అధికారులతో క‌లిసి ప‌రిశీలించారు. 
 
ఈ సందర్బంగా జేఈవో మాట్లాడుతూ, కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న ఇంజినీరింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రాంగణమంతా  సుంద‌రంగా తీర్చీదిద్ధాల‌న్నారు. లక్షలాదిగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కల్యాణం రోజున అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ, త‌లంబ్రాలు పంపిణీ చేయాల‌న్నారు.  ఆలయం, పరిసర ప్రాంతాలలో  తగినన్ని తాత్కాలిక, మొబైల్‌ మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేయాల‌న్నారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యంకు నిర్వహణపై  ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్‌  స్థలాలను అభివృద్ధి చేయాల‌న్నారు.
 
అనంత‌రం జేఈవో అధికారుల‌తో క‌లిసి కల్యాణ వేదిక ముఖ్యమంత్రి విడిది చేసే భవనం, ఆలయ పరిసరాలు, పుష్కరిణి, వాహన మండపము, అన్నప్రసాదాలు, త్రాగునీరు పంపిణీ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.  
 
టీటీడీ సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ కుమార్, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి అధికారి శ్రీ  శాస్త్రి, ఇతర అధికారులు  పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.