JEO INSPECTS AVILALA TANK WORKS_ అవిలాల చెరువు పనులను పరిశీలించిన టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

Tirupati, 17 Feb. 19: Tirupati JEO Sri B Lakshmikantham on Sunday morning inspected the ongoing development works of Avilala Tank in Tirupati.

He instructed the concerned officials to speed up the works and develop the tank as the most beautiful place of attraction with walkpaths, greenery etc.

SE 1 Sri M Ramesh Reddy, EE Sri Nageswara Rao and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

అవిలాల చెరువు పనులను పరిశీలించిన టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

తిరుపతి, 17 ఫిబ్రవరి 2019: ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన తిరుప‌తిని సుంద‌ర‌న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డంలో భాగంగా అవిలాల చెరువులో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆదివారం ఉదయం టిటిడి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ మొదటిదశలో రూ.80.14 కోట్ల‌తో జరుగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అవిలాల చెరువు అభివృద్ది పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రాబాబు నాయుడు గత డిసెంబర్ 6వ తేదిన శంకుస్థాపన చేశారని, ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఇందులో శ్రీవేంకటేశ్వర ఆధ్యాత్మిక వైభవ ఉద్యానవనం (స్పిరిచువ‌ల్ థీమ్ పార్క్‌), ఇంట‌ర్న‌ల్ ఫెన్సింగ్ లోప‌ల ప‌చ్చికబ‌య‌ళ్లు, శేషాచ‌ల అడ‌వుల్లో జీవ‌వైవిద్యాన్ని ప్ర‌తిబింబించేలా ఏర్పాట్లు, జ‌లాశ‌యాలు, రాశి వ‌నం, న‌క్ష‌త్ర వ‌నం, నవగ్ర‌హ వ‌నం, హీలింగ్ గార్డెన్‌, థీమ్ గార్డెన్‌, అట‌వీ పుష్పాల వ‌నం, వివిధ ర‌కాల పుష్ప‌వ‌నాలు, సీతాకోక‌చిలుక‌ల వ‌నం, పిల్ల‌ల కోసం ప్ర‌త్యేక ఉద్యాన‌వ‌నం, గ‌రుడ వ‌నం తదితర పనులను చేపడుతున్నట్లు వివరించారు.

జెఈఓ వెంట టిటిడి ఎస్ఈ శ్రీ రమేష్ రెడ్డి, ఈఈ శ్రీ జయరాములు నాయక్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.