JEO INSPECTS KT AND SRINIVASAM _ తిరుపతిలో జెఈఓ తనిఖీలు

TIRUPATI, 18 NOVEMBER 2021: Due to the heavy downpour witnessed on Thursday in Tirupati, the Kapilatheertham torrent is in full flow forcing the temple management of TTD to stall the entry of pilgrims.

 

Three of the temple pillars got affected by this rain havoc. 

 

TTD JEO Sri Veerabrahman inspected Sri Kapileswara Swamy temple and immediately instructed the officials concerned to restore the affected pillars. The pillars were also restored immediately.

 

Later he also inspected Srinivasam Rest House and interacted with the devotees who were stranded due to closure of both Ghat roads as well Footpath routes following the unprecedented inclement weather conditions.

 

He also instructed the officials concerned to provide Annaprasadam to the stranded pilgrims in the rest house.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుపతిలో జెఈఓ తనిఖీలు

తిరుపతి, 2021 నవంబరు 18: టిటిడి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం గురువారం రాత్రి తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయం, శ్రీనివాసం వసతి సముదాయాన్ని పరిశీలించారు.

భారీ వర్షం కారణంగా కపిలతీర్థం జలపాతం ప్రవాహం ఎక్కువగా రావడంతో అక్కడి మండపానికి గల మూడు స్తంభాలు దెబ్బ తిన్నాయి. జెఈవో ఆ ప్రాంతాన్ని పరిశీలించి వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జలపాతం ప్రవాహం ఎక్కువగా ఉండడంతో భక్తుల దర్శనాన్ని నిలిపివేయాలని సూచించారు. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత దర్శనానికి భక్తులను అనుమతిస్తామని జెఈఓ తెలిపారు.

అలాగే, తిరుపతిలోని శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయంలో బస చేస్తున్న యాత్రికుల సౌకర్యాలను జెఈవో పరిశీలించారు. భారీ వర్షం కారణంగా ఘాట్ రోడ్లు మూసివేయడంతో తిరుమలకు చేరుకునే పరిస్థితి లేకపోవడంతో యాత్రికులు ఇక్కడే ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. యాత్రికులందరికీ అన్నప్రసాదాలు అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.