JEO INSPECTS SANITATION AT TTD BUILDING _ టిటిడి పరిపాలనా భవనంలో పారిశుద్ధ్య చర్యలను పరిశీలించిన జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి

Tirupati, 22 October 2020: TTD Joint executive officer (Education and Health) Smt Sada Bhargavi on Thursday inspected the sanitation and cleanliness activities at the TTD administrative buildings.

Her inspection tour included toilets and drinking water points in the administrative buildings as per guidelines of Covid-19 for sanitation and cleanliness. The JEO advised use of automated hand sanitizers for quality health of all employees.

She instructed the civil, electrical and water works officials to correct all the lapses on a war footing basis. Thereafter JEO inspected the stock godown of the health department located at the Bhudevi Complex near Alipiri.

Officials of the electrical & waterworks and Additional health officer Dr.Sunil Kumar accompanied the JEO during the inspection tour.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి పరిపాలనా భవనంలో పారిశుద్ధ్య చర్యలను పరిశీలించిన జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి
 
తిరుపతి, 2020 అక్టోబర్ 22: తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో పారిశుద్ధ్య చర్యలతోపాటు ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలోని పలు స్టాక్ గోడౌన్లను జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి గురువారం పరిశీలించారు.
 
టిటిడి పరిపాలన భవనంలోని మరుగుదొడ్లను, నీటి కొళాయిలను జెఈవో పరిశీలించారు. కోవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉండేలా అవసరమైన చోట్ల ఆటోమేటెడ్ హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరుగుదొడ్ల వద్ద గుర్తించిన లోపాలను సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్ అధికారులు త్వరితగతిన సరి చేయాలన్నారు. అనంతరం అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద, ఓల్డ్ హుజుర్ ఆఫీస్ వద్ద గల ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలోని స్టాక్ గోడౌన్లను తనిఖీ చేశారు.
 
జెఈవో వెంట టిటిడి అదనపు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సునీల్ కుమార్ తదితరులు ఉన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.