JEO RELEASES SRI KT POSTERS_ శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
Tirupati, 11 Feb. 19: Tirupati JEO Sri B Lakshmi Kantham on Monday evening released the posters of manual brahmotsavams of Sri Kapileswara Swamy temple on Monday evening in his chambers in TTD administrative building.
Speaking on this occasion, he said the manual brahmotsavams will be observed from February 25 till March 6 with Koil alwar tirumanjanam on February 23 and Ankurarpanam on February 24.
He said all arrangements for the big fete are underway for the devotees.
Temple DyEO Sri Subrahmanyam, AEO Sri Nagaraju and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
తిరుపతి, 2019 ఫిబ్రవరి 11: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ పోస్టర్లను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం టిటిడి పరిపాలనా భవనంలోని తమ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి మార్చి 6వ తేదీ వరకు శ్రీకపిలేశ్వరాలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 23వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహించనున్నట్లు వివరించారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి, అమ్మ వార్ల కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా జెఈవో కోరారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీనాగరాజు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలిప్,ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
25-02-2019(సోమవారం) ధ్వజారోహణం(కుంభలగ్నం) హంస వాహనం
26-02-2019(మంగళవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
27-02-2019(బుధవారం) భూత వాహనం సింహ వాహనం
28-02-2019(గురువారం) మకర వాహనం శేష వాహనం
01-03-2019(శుక్రవారం) తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం
02-03-2019(శనివారం) వ్యాఘ్ర వాహనం గజ వాహనం
03-03-2019(ఆదివారం) కల్పవృక్ష వాహనం అశ్వవాహనం
04-03-2019(సోమవారం) రథోత్సవం(భోగితేరు) నందివాహనం
05-03-2019(మంగళవారం) పురుషామృగవాహనం కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం
06-03-2019(బుధవారం) శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం,
సూర్యప్రభ వాహనం. ధ్వజావరోహణం.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
టిటిడి పరిపాలన భవనంలోని పలు విభాగాల కార్యాలయాలను పరిశీలించిన జెఈవో :
అంతకుముందు తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం సోమవారం ఉదయం టిటిడి పరిపాలనా భవనంలోని వివిధ విభాగాల కార్యాలయాలు, టిటిడి ఉద్యోగుల క్యాంటీన్, ఆసుపత్రి, ఉద్యాణవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఉద్యోగులు తప్పని సరిగా గుర్తింపు కార్డును ధరించాలని, సమయపాలన పాటించాలని, కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.