JEO REVIEW MEETING_ శ్రీవారి రథోత్సవం ఏర్పాట్లపై తిరుమ‌ల‌ జెఈవో సమీక్ష

Tirumala, 19 September 2018: As the wooden chariot procession will be observed on Thursday, Tirumala JEO Sri KS Sreenivasa Raju asked all officials to be more attentive in their arrangements.

The review meeting with senior officers held at Rambhageecha Control Room on Wednesday.

He instructed the engineering wing to verify the hydraulic brakes of the chariot for a smooth procession. The police and vigilance sleuths should coordinate with each other on security arrangements for the same, he added.

CVSO Incharge Sri Siva Kumar Reddy, SEs Sri Ramachandra Reddy, Sri Venkateswarulu and others were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీవారి రథోత్సవం ఏర్పాట్లపై తిరుమ‌ల‌ జెఈవో సమీక్ష

తిరుమల, 2018  సెప్టెంబర్‌ 19: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 7.30 గం||లకు రథోత్సవం జరుగనున్న నేపథ్యంలో విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశముందని, రద్దీకి తగ్గట్టు పటిష్టంగా ఏర్పాట్లు చేపట్టాలని తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు అధికారులను ఆదేశించారు. రథోత్సవం ఏర్పాట్లపై తిరుమలలోని రాంభగీచా విశ్రాంతి గృహాల ఎదురుగా గల బ్రహ్మోత్సవ సెల్‌లో బుధ‌వారం తిరుమల జెఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ రథాన్ని లాగే క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టిటిడి ఇంజినీరింగ్‌, భద్రత, పోలీసు విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. రథం బ్రేకులను ముందస్తుగా పరిశీలించి సక్రమంగా పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రథం తిరిగే క్రమంలో ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన సీనియర్‌ అధికారులు అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పల్లం ఉన్న ప్రాంతాల్లో రథం వేగంగా వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చక్రాల వద్దకు  భక్తులు  రాకుండా నిర్దేశిత ప్రాంతంలో ఉండేలా జాత్రగ్తలు తీసుకోవాలన్నారు. రథం లాగేందుకు వినియోగించే తాడు పటిష్టంగా ఉండేలా చూడాలన్నారు. రథోత్సవంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మైక్‌ల ద్వారా అనౌన్స్‌ చేయాలని సూచించారు. మాడ వీధుల్లో రథం కోసం వేసిన ఇసుకను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. నాలుగు మాడ వీధులతో పాటు వైభవోత్సవ మండపం వద్ద అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ఈ సమీక్షలో టిటిడి ఇంచార్జ్ శ్రీ శివకుమార్ రెడ్డి, ఎస్ఈ 2 శ్రీ రామచంద్రా రెడ్డి  సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.