JEO REVIEWS ON TIRUCHANOOR DEVELOPMENT WORKS_ తిరుచానూరును మరింతగా అభివృద్ధి చేయాలి – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
Tirupati, 17 Feb. 19: Tirupati JEO Sri B Lakshmikantham on Sunday evening reviewed on the development works of Tiruchanoor in Sri Padmavathi Rest House in Tirupati.
Speaking on this occasion he said, various development works which are in progress and yet to be started. Listing out some important works he said, a CC pavement will be constructed at Rs.1.2crores to divert vehicular traffic from SBI ATM to High school entrance.
The other works includes development of parking area in front of shopping complex at Rs.30lakhs, improvement of road near Ghantasala statue at Rs.10lakhs, construction of shopping complex in front of Friday Gardens which are yet be commenced at Rs.81lakhs, laying of shelter between Asthana Mandapam and Friday Gardens at Rs.50lakhs which are under progress, further improvements in Asthana Mandapam creating more facilities to pilgrims etc.
During the day I also inspected Avilala Tank and observed the works, which are under progress, he added.
CE Sri Chandra Sekhar Reddy, Estates Officer Sri L Vijaya saradhi, EE Sri Satyanarayana, DyEO Smt Jhansi Rani and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
తిరుచానూరును మరింతగా అభివృద్ధి చేయాలి – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
తిరుపతి, 2019 ఫిబ్రవరి 17: శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరుకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరింతగా అభివృద్ధి చేయాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి భవనంలో ఆదివారం సాయంత్రం జెఈవో టిటిడి, ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుచానూరుకు విచ్చేసే భక్తుల సంఖ్యను పెంచాలని, అందుకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. భక్తులు తిరుమలలో శ్రీభూవరహాస్వామివారు, శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్న అనంతరం అమ్మవారిని దర్శించుకుంటే యాత్ర సంపూర్ణమవుతుందని పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు. అందుకు అనుగుణంగా స్థల పురాణం తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు.
తిరుచానూరులో ట్రాఫిక్‌కు ఇబ్బందిలేకుండా రూ.1.2 కోట్లతో ఎస్‌బిఐ ఎటిమ్ నుండి జిల్లా పరిషత్ పాఠశాల వరకు సిమెంటు రోడ్డును ఏర్పాటు చేయడం, రూ.10 లక్షలతో ఘంటసాల విగ్రహం నుండి రోడ్డు వెడల్పు, రూ.30 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద పార్కింగ్‌ను అభివృద్ధి చేయాలన్నారు. అదేవిధంగా ఫ్రైడే గార్డెన్స్ ముందు రూ.81 లక్షలతో నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, రూ.50 లక్షలతో ఆస్థాన మండపం మరియు ఫ్రైడే గార్డెన్స్ వద్ద షల్టర్ నిర్మాణంపై చర్చించినట్లు వివరించారు. ఆస్థాన మండపం వద్ద భక్తులకు కల్పించవలసిన ఇతర సౌకర్యాలపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్టేట్ అధికారి శ్రీ పార్థసారధి, ఇఇ శ్రీసత్యనారాయణ, డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.