KAREERI ISTHI _ తిరుమలలో కారిరిష్ఠియాగం ప్రారంభం 

Tirumala, 19 August 2009: The TTD has started five day Kareeri Isthi Yagam duly invoking the blessing of Lord Varuna for Rains at Parveti Mandapam near Gogarbham Dam, Tirumala on Wednesday morning.

Speaking on this occasion the Sri I.Y.R.Krishna Rao, Executive Officer, TTDs informed that for the Loka Kalyanam and for the well being of the people of Andhra Pradesh as well as the country, the TTD has started the Kareeri Isthi in Tirumala. Nearly 40 Ritwiks from different parts of Andhra Pradesh are performing this yagam. The yagam will conclude on Aug 23.

Sri Gopalakrishna, DyEO ( Temple ), Tirumala and others took part.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమలలో కారిరిష్ఠియాగం ప్రారంభం

తిరుమల, ఆగష్టు -19,  2009: ఆగస్టు 19వ తేదిన ఉదయం తిరుమల వద్దగల పార్వేట మండపం వద్ద కారిరిష్ఠియాగం ఘనంగా ప్రారంభమైంది.

ఈ సందర్భంగా పరిపూర్ణమైన వాయువు ప్రేరణలతో మేఘాల నుండి జలధారలు కురవాలనే మంత్రంతో ఈ కారిరిష్ఠి ప్రారంభమైంది. కరీర శబ్దమునకు అర్థము వెదురుబియ్యం, నల్లబియ్యం, కర్పూరపు పిండి తదితర ద్రవ్యములు ప్రధానంగా ఈ క్రియలో వినియోగించడం వలన కారిరిష్ఠి అను పేరు ప్రసిద్దమైనది. నల్లటి వస్త్రములు ధరించడం వెనుక గల కారణం గగన సంచారమైన మేఘములు నల్ల వర్ణముగా ఉండుట వలన, అన్ని ద్రవ్యములు ఇదే వర్ణములు కల్గివుండడం వలన, ఈ వస్త్రములు, ఈద్రవ్యములు మేఘాలను ఆకర్షించి తద్వారా పరిపూర్ణమైన వర్షమును కురిసేటట్లు చేసే విధానము కారిరిఇస్ఠి యాగం అని వేదం నందు చెప్పబడినది.

ఈసందర్భంగా తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌.కృష్ణారావు మాట్లాడుతూ లోకంలో వర్షాభావం పరిస్థితుల వలన ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ప్రతి ఒక్కరూ సుభిక్షింగా వుండేందుకుగాను తితిదే ఈ కారిరిష్ఠ్ఠి తిరుమలలో ప్రారంభించామని, తద్వారా వరుణ దేవుని కరుణతో విస్తారంగా వర్షాలు పడాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కారిరిష్ఠినందు దాదాపు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 40 మంది రిత్విక్కులు పాల్గొన్నారు. ఈ కారీరిష్ఠి ఈనెల 23 వరకు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.