KAREERI ISTHI ANKURARPANAM HELD _ కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ
Tirumala, 22 August 2023: Appeasing the rain god, TTD commenced Kareeri Isthi, Varuna Japa, Parjanyashanti Yagam with Ankurarpanam on Tuesday evening at Dharmagiri Veda Vignana Peetham in Tirumala.
As part of it Ganapathi Puja, Punyahavachanam, Ankurarpanam were performed.
Every day there will be homams between 9am and 12noon. 32 Ritwiks will perform these Yagams.
Principal Sri KSS Avadhani is supervising the arrangements.
కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుమల, 2023 ఆగస్టు 22: రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో టీటీడీ చేపట్టిన కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, ప్రాయశ్చిత్త హోమం, అంకురార్పణ చేపట్టారు.
ఆగస్టు 26వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యాగ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 32 మంది వేద, శ్రౌత, స్మార్థపండితులు యాగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చివరి రోజు మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. ధర్మగిరి వేద విజ్ఞన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్.అవధాని ఆధ్వర్యంలో ఈ యాగ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.