KARTHIKA PARVA DEEPOTSAVAM IN SRI TT ON NOVEMBER 18 _ న‌వంబ‌రు 18న కార్తీక ప‌ర్వ‌దీపోత్స‌వం

POURNAMI GARUDA SEVA ON NOVEMBER 19

 

TIRUMALA, 17 NOVEMBER 2021: The annual Karthika Parva Deepotsavam will be observed in Tirumala temple on November 18.

 

The ghee-lit lamps illuminate the temple on this special occasion. Apart from the main temples, all the sub-shrines are lit with ghee lamps.

 

This event will be observed between 5:30pm and 8pm.

 

While on November 19, in connection with Karthika Pournami, Garuda Seva will be observed between 7pm and 9pm in Tirumala

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

న‌వంబ‌రు 18న కార్తీక ప‌ర్వ‌దీపోత్స‌వం

తిరుమల‌, 2021 నవంబరు 17:  తిరుమల శ్రీవారి ఆలయంలో న‌వంబ‌రు 18వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం జ‌రుగ‌నుంది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు.

 ఈ సందర్భంగా సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆ తర్వాత వరుసగా గర్భాలయం, ఉప ఆల‌యాల్లో దీపాలను ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను టిటిడి రద్దు చేసింది.

న‌వంబ‌రు 19న పౌర్ణమి గరుడ సేవ

పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో న‌వంబ‌రు 19న శుక్ర‌వారం గరుడసేవ జరుగనుంది. ఈ రోజు కార్తీక పౌర్ణ‌మి కావ‌డం విశేషం.

ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.