KASYAPA JAYANTI HELD _ ఘనంగా శ్రీ కశ్యప మహర్షి జయంతి
TIRUMALA, 20 AUGUST 2023: Under the joint aegis of Alwar Divya Prabandha Project and Sri Vaikhanasa Divya Siddhanta Vivardini Project, Sage Kasyapa Jayanti was observed in Tirumala on Sunday.
A literary session was held at Astana Mandapam where in scholars recalled the great works of Sage Kasyapa, who happens to be one of the disciples of Sage Vikhanasa.
The office bearers of the Vivardhini project Sri Raghavacharyulu, Sri Prabhakaracharyulu, Sri Srinivasa Deekshitulu and others were present.
ఘనంగా శ్రీ కశ్యప మహర్షి జయంతి
తిరుమల, 2023 ఆగస్టు 20: తిరుమల ఆస్థాన మండపంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ విఖనస మహర్షి శిష్యులలో ఒకరైన శ్రీ కశ్యప మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ శ్రీ విఖనస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవారికి ఆరాధనలు జరుగుతున్నాయని చెప్పారు. కశ్యప మహర్షి రచించిన జ్ఞానకాండ గ్రంథం ఎన్నో వైఖానస ఆలయాలలో నిర్వహించే ఆరాధనలకు అత్యంత ప్రామాణికంగా నిలుస్తోందన్నారు. అదేవిధంగా ఆలయ నిర్మాణానికి అవసరమైన భూపరీక్ష, శంకుస్థాపన, మండపాల నిర్మాణం, ఆలయ నిర్మాణశైలి, విగ్రహప్రతిష్టకు సంబంధించిన జ్ఞానం ఈ గ్రంథంలో ఉందన్నారు. అనంతరం శ్రీ జి.శ్రీలక్ష్మీ నృత్య నీరాజనం సమర్పించారు
ఈ కార్యక్రమంలో వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ అధ్యక్షులు శ్రీ రాఘవాచార్యులు, కార్యదర్శి శ్రీ జి.ప్రభాకరాచార్యులు, ప్రముఖ పండితులు శ్రీ రామకృష్ణ శేషసాయి, శ్రీ ముత్తుభట్టాచార్యులు, శ్రీ శ్రావణ్ కుమార్, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం, ధర్మగిరి వేద పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.