KSHEERADHIVASAM PERFORMED _ భువ‌నేశ్వ‌ర్‌ శ్రీ‌వారి ఆలయంలో శాస్త్రోక్తంగా క్షీరాధివాసం

BHUBANESHWAR, 23 MAY 2022: On the third day of the ongoing rituals at Sri Venkateswara Swamy temple at Bhubaneswar, a series of religious events were performed under the supervision of Agama Advisor Dr Vedantam Vishnubhattacharyulu as per the tenets of Vaikhanasa Agama.

Earlier between 8.30am and11.30am Viswaksena Aradhana, Punyahavachanam, Agni Pranayanam, Kalasaradhana, Ukta Homam and Navakalasa Sthapana Ksheeradhivasam were performed. 

Ksheeradhivasam is an Agamic ritual wherein the Mula Virat which is going to be consecrated in the temple will be cleansed with the sacred milk by chanting relevant mantras

Again in the evening between 6.30pm and 9.30pm, the same events will be repeated by the religious staff amidst the chanting of Vedic mantras. 

TTD temple officials including Deputy EO Sri Gunabhushan Reddy, All Projects Program Officer Sri Vijayasaradhi, AEO Sri Doraswamy Naik, Superintendent Sri Mallikarjuna and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భువ‌నేశ్వ‌ర్‌ శ్రీ‌వారి ఆలయంలో శాస్త్రోక్తంగా క్షీరాధివాసం

తిరుపతి, 2022 మే 23: భువ‌నేశ్వ‌ర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్యక్రమాల్లో భాగంగా సోమ‌వారం ఉదయం క్షీరాధివాసం నిర్వహించారు.

ఉద‌యం 8.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు విష్వక్సేన పూజ, పుణ్యాహ‌వ‌చ‌నం, అగ్నిప్ర‌ణ‌య‌నం, క‌ల‌శారాధ‌న‌, ఉక్త‌హోమాలు, న‌వ‌క‌ల‌శ స్న‌ప‌నం నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, ప‌సుపు, చందనంల‌తో విశేషంగా అభిషేకం చేశారు.

అనంత‌రం శ్రీ‌వారి విగ్ర‌హ‌నికి క్షీరాధివాసం నిర్వ‌హించారు. శ్రీ‌వారి విగ్ర‌హ‌నికి వేద మంత్రాల మ‌ధ్య పాల‌తో విశేషంగా అభిషేకం (క్షీరాధివాసం) చేయ‌డం వ‌ల‌న విగ్ర‌హంలో ఎలాంటి దోషాలు ఉన్న తొల‌గి పోతాయ‌ని అర్చ‌కులు తెలిపారు. త‌రువాత కుంభారాధ‌న‌, ఉక్త హోమాలు చేపట్టారు.

సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వ‌ర‌కు క‌ల‌శారాధ‌న‌, విశేష హోమాలు, వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్య‌క్రమాల్లో స్థానిక సలహా కమిటీ అధ్యక్షులు శ్రీ దుష్మంత్ కుమార్, డెప్యూటీ ఈవో శ్రీ గుణభూషణ్‌రెడ్డి, టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ విజయసారధి, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ విష్ణుబ‌ట్టాచార్యులు, ఏఈవో శ్రీ దొరస్వామి నాయక్, సూపరింటెండెంట్ శ్రీ మల్లికార్జున, ఇత‌ర అధికారులు, అర్చ‌కులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.