KUMBHMELA PRACHARA RATHAM TO REACH TIRUMALA ON MARCH 4 _ మార్చి 4న తిరుపతికి శ్రీవారి మహాకుంభమేళా కల్యాణరథం : తితిదే ఈవో

Tirumala, 01 March, 2013: After successfully completing its spiritual task at Maha Kumbhmela in Allahabad, TTD’s Srivari Kumbmela Prachara Ratham will conclude its yatra at Tirumala on March 4, said TTD EO Sri LV Subramanyam.

Addressing media persons after Dial Your EO, he said, it is a great experience for him as well to 380 odd employees of TTD who took part in the Maha Kumbhmela at Allahabad. “The most fascinating thing is that the rays of Sun God touched the holy feet of Lord Venkateswara on Rathsapthami Day at Kumbhmela in the temple set up by TTD in Sector 6.

We have performed 10 Srinivasa Kalyanams, 3 Snapana Tirumanjanams at various places in Allahabad. Over 2.5lakh people had darshan of Lord Venkateswara”, he recalled.

Meanwhile, the EO said, with an aim to inclucate the spiritual values and ethics among the youth today, TTD will be giving a week-long summer training camp-“Subhapradam” for the tenth class passouts, Junior inter students across the state.

“For the boys, there will be training classes across the state while for girls we have identified five centres only. The applications to apply for these classes will be available in all the TTD run Kalyana Mandapams from March 1 to 31”, he maintained.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 4న తిరుపతికి శ్రీవారి మహాకుంభమేళా కల్యాణరథం : తితిదే ఈవో

తిరుమల, 2013 మార్చి 01:  భారతదేశంలోనే ఒకానొక ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న అలహాబాదు నగరంలోని మహాకుంభమేళాలో తొలిసారిగా తితిదే నుండి 380 పైచిలుకు సిబ్బందితో పాల్గొన్న శ్రీవారి మహాకుంభమేళా ప్రచార రథం మార్చి 4వ తారీఖున తిరుపతికి చేరనుందని తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.

 

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం నాడు డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం  జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుంభమేళాలో తితిదే సాగించిన ప్రస్థానం ఒక అద్భుతమైన జ్ఞాపకమన్నారు. ఈ సందర్భంగా తితిదే పది కల్యాణాలను, మూడు స్నపనతిరుమంజన కార్యక్రమాలను వివిధ ప్రాంతాల్లో నిర్వహించిందన్నారు. సెక్టార్‌-6లో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయాన్ని 2.50 లక్షల మంది భక్తులు సందర్శించినట్టు తెలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా ఫిబ్రవరి 17 రథసప్తమి పర్వదినాన నమూనా ఆలయంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి పాదాలను సూర్యకిరణాలు స్పృశించడం మహాద్భుతమని ఆయన వెల్లడించారు.
స్వామివారి మహత్యం విశ్వవ్యాప్తం అనడానికి చిన్న ఉదాహరణ డాక్టర్‌ బన్సల్‌ దంపతులు అలహాబాదు యమునా నదీ తీరంలో పది ఎకరాల స్థలాన్ని ఆలయ నిర్మాణం కొరకు విరాళంగా ఇవ్వడానికి ముందుకు రావడమన్నారు.
మార్చి 4వ తారీఖున అలహాబాదు నుండి శ్రీవారి ప్రచార రథం తిరుగు ప్రయాణంలో భాగంగా తిరుపతికి చేరుకుంటుందన్నారు. ఉదయం 8.00 గంటలకు మహతి కళాక్షేత్రం నుండి ఈ ప్రచార రథం  గాంధీ రోడ్డు, నగరపాలక కార్యాలయం, తితిదే పరిపాలనా భవనం, అన్నారావు కూడలి, హరేరామ హరేకృష్ణ మందిరం, అలిపిరి మీదుగా తిరుమలకు చేరుకుంటుందని ఈవో తెలిపారు.

 

తిరుమలలో శాస్త్రోక్తంగా మహాకుంభమేళా పవిత్ర గంగాజలాన్ని స్వామి పుష్కరిణిలో కలుపనున్నట్టు తెలిపారు. తద్వారా కుంభమేళాకు వెళ్లలేని భక్తులు స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి తరించాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా తిరుపతి నుండి తిరుమల వరకు సాగే ప్రచార రథయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.

 

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.