LAC MEMBERS TAKES OATH _ హైదరాబాద్ టీటీడీ స్థానిక సలహా మండలి ప్రమాణస్వీకారం
Tirupati, 8 Feb. 22: TTD Chairman Sri YV Subba Reddy administered oath of office with 24 LAC members at Hyderabad which included three Vice Presidents.
Speaking on the occasion the Chairman wished all the members to take up dharmic programmes in a wide spread manner especially Gudiko Gomata in the state of Telangana on Tuesday.
This event was held in SV Temple at Jubilee Hills. The Chairman of LAC Sri GV Bhaskar Rao, AEO Sri Jaganmohanacharyulu were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
హైదరాబాద్ టీటీడీ స్థానిక సలహా మండలి ప్రమాణస్వీకారం
– హాజరైన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
తిరుపతి 8 జనవరి 2022: టీటీడీ హైదరాబాద్ స్థానిక సలహా మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం మంగళవారం జరిగింది. జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీటీడీ పాలకమండలి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
24 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా,ఇందులో ముగ్గురు ఉపాధ్యక్షులు ఉన్నారు. స్థానిక సలహా మండలి ఛైర్మన్ శ్రీ జివి భాస్కర్ రావు, ఏ ఈవో శ్రీ జగన్మోహనాచార్యులు పాల్గొన్నారు.
అనంతరం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో టీటీడీ మరింత పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. గుడికో గోమాత కార్యక్రమం అన్ని ముఖ్య ఆలయాలకు అమలు చేసి, గో పూజ అందుబాటులోకి వచ్చేలా స్ధానిక సలహా మండలి కృషి చేయాలని ఆయన కోరారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది