LAKSHKUMKUMA ARCHANA AT SRI KAPILESWAA SWAMY TEMPLE ON 15th SEPTEMBER _ సెప్టెంబ‌రు 15న శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో ల‌క్ష‌కుంకుమార్చ‌న సేవ‌

LAKSHKUMKUMA ARCHANA AT SRI KAPILESWAA SWAMY TEMPLE ON 15th SEPTEMBER

 

TIRUPATI, 14 SEPTEMBER 2023: Lakshakumkumarchana seva will be held for Sri Kamakshi Ammavaru on Friday, September 15 at the Tirupati Sri Kapileswara Swamy temple.

 

On the last Friday of the month of Shravana, it is customary to perform this Seva in the temple.

 

As a part of this, Ganapati Puja and Punyahavachanam will be performed at 6 am and Lakshkumkumarchana will be performed from 7 am to 12 noon.

 

Sri Chandrasekhara Swamy, Sri Manonmani Ammavari Street Festival will be held from 6 pm to 8 pm.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

సెప్టెంబ‌రు 15న శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో ల‌క్ష‌కుంకుమార్చ‌న సేవ‌

తిరుపతి‌, 14 సెప్టెంబ‌రు 2023: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 15న శుక్ర‌వారం శ్రీ కామాక్షి అమ్మవారికి లక్ష కుంకుమార్చన సేవ జ‌రుగ‌నుంది. శ్రావణమాసంలో చివరి శుక్రవారం రోజున ఆల‌యంలో లక్ష కుంకుమార్చన సేవ నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఇందులో భాగంగా ఉద‌యం 6 గంట‌ల‌కు గ‌ణ‌ప‌తి పూజ‌, పుణ్యాహవ‌చ‌నం, ఉద‌యం 7 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఆలయంలోని మండపంలో శ్రీ కామాక్షి అమ్మవారిని కొలువుదీర్చి ల‌క్ష‌కుంకుమార్చన నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు శ్రీ చంద్ర‌శేఖ‌ర స్వామి, శ్రీ మ‌నోన్మ‌ణి అమ్మ‌వారి వీధి ఉత్స‌వం జ‌రుగ‌నుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.