LONGEST SERVING CE OF TTD RETIRES_ ఘ‌నంగా టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ చింతా చంద్రశేఖర్ రెడ్డి ఆత్మీయ వీడ్కోలు స‌భ.

Tirupati, 31 Jul. 19: After offering impeccable services as Chief Engineer of Tirumala Tirupati Devasthanams, Sri Chinta Chandra Sekhar Reddy retired from service on attaining the age of superannuation on Wednesday.

Sri Chandrasekhar Reddy joined in TTD in 1984 on August 16 and holds the record of having served in the much-coveted post as CE of TTD for nine long years in his 35 years of tenure.

Often admired for his simplicity, honesty and dedication towards work, Sri Reddy has many development works in his kitty which includes Extention of Mada streets, Avilala tank works, PAN building at Tiruchanoor, Vishnunivasam overbridge, Srinivasam Subway, Sri Venkateswara Kshetrams at Kurukshetra, Kanyakumari, Hyderabad etc.

TTD EO Sri Anilkumar Singhal, Special Officer Tirumala Sri AV Dharma Reddy, JEO Tirupati Sri Basant Kumar, CVSO Sri Gopinath Jatti and other senior officers of TTD congratulated and felicitated the CE at SVETA building on Wednesday evening.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఘ‌నంగా టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ చింతా చంద్రశేఖర్ రెడ్డి ఆత్మీయ వీడ్కోలు స‌భ.

తిరుపతి, 2019 జూలై 31: టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ చింతా చంద్రశేఖర్ రెడ్డి ప‌ద‌వీ విర‌మ‌ణ సంద‌ర్భంగా ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆధ్వ‌ర్యంలో బుధవారం సాయంత్రం తిరుప‌తిలోని శ్వేత‌ భవనంలో ఆత్మీయ వీడ్కోలు స‌భ ఘనంగా జరిగింది. శ్రీ‌వారి స‌న్నిధిలో భ‌క్తుల‌కు సేవ‌లందించ‌డాన్ని పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్నాన‌ని ఈ సంద‌ర్భంగా టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ సి. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. టిటిడి ఇంజినీరింగ్ విభాగంలో 35 ఏళ్లపాటు , చీఫ్ ఇంజనీర్ గా 9 ఏళ్లపాటు విశేష సేవలు అందించారని సన్మానసభకు వచ్చిన ఉద్యోగులు మాట్లాడారు.

అనంతరం అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు శాలువతో, శ్రీవారి చిత్రపటం, ప్రసాదంతో ఘనంగా సన్మానం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఏ.వి. ధర్మారెడ్డి, తిరుపతి జేఈవో శ్రీ పి.బసంత్ కుమార్, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి , ఎఫ్ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, ఎస్ఇలు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ ర‌మేష్‌రెడ్డి, శ్రీ రాములు, శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, వెల్ఫేర్ విభాగం డిప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత ఇత‌ర అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.