MAHA SHIVARATRI CELEBRATIONS AT SRI SESHACHALA LINGESWARA TEMPLE FROM 20-22 _ ఫిబ్ర‌వ‌రి 20 నుండి 22వ తేదీ వ‌ర‌కు శ్రీ శేషాచ‌ల లింగేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో మ‌హాశివ‌రాత్రి ఉత్స‌వం

Tirupati, 19 Feb. 20: TTD is organizing grand Maha Shivaratri celebrations at the Sri Seshachala Lingeswara temple at Kandulavaripalli village of Chandragiri mandal from February 20-22.

Celebrations will begin with Kalasasthapanam and Ekadasa Rudra Avahanam in the early hours on February 20. Next morning Abhisekam is performed to Sri Vigneswara, Sri Subramanya, Sri Anjaneya and Sri Umamaheswara deities. 

Later on Ekadasha Rudra Abhisekam for Seshachala Limgeswara and Nandikeswara swamy will be performed in the evening. Dharmic programmes including Harikatha, Bhakti Sangeet etc. will also be arranged for the occasion.

On February 22, midnight Mahanyasapurvaka Rudrabhishekam and Kalyanotsavam will be performed. Interested couple could participate in the event with a ₹300 ticket in the Kalyanotsavam. Later TTD is organising Gramotsavam in the evening. DyEO Sri P Subramanyam is supervising all the arrangements.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

ఫిబ్ర‌వ‌రి 20 నుండి 22వ తేదీ వ‌ర‌కు శ్రీ శేషాచ‌ల లింగేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో మ‌హాశివ‌రాత్రి ఉత్స‌వం

ఫిబ్రవరి 19, తిరుపతి, 2020: టిటిడికి అనుబంధంగా ఉన్న చంద్ర‌గిరి మండ‌లం కందుల‌వారిప‌ల్లిలోని శ్రీ శేషాచ‌ల లింగేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి 20 నుండి 22వ తేదీ వ‌ర‌కు మ‌హాశివ‌రాత్రి ఉత్స‌వం ఘ‌నంగా జ‌రుగ‌నుంది.

ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన సాయంత్రం 4.30 గంట‌లకు క‌ల‌శ స్థాప‌న‌, ఏకాద‌శ రుద్ర ఆవాహ‌నం నిర్వ‌హిస్తారు. ఫిబ్ర‌వ‌రి 21న మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా తెల్ల‌వారుజామున 4.15 నుండి 5 గంట‌ల వ‌ర‌కు శ్రీ విఘ్నేశ్వ‌ర‌స్వామి, శ్రీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి, శ్రీ ఆంజ‌నేయ‌స్వామి, శ్రీ ఉమామ‌హేశ్వ‌ర‌స్వామివారికి అభిషేకం జ‌రుగ‌నుంది. ఉద‌యం 5 నుండి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ శేషాచ‌ల లింగేశ్వ‌ర‌స్వామివారికి ఏకాద‌శ రుద్రాభిషేకం నిర్వ‌హిస్తారు. సాయంత్రం 4.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు శ్రీ శేషాచ‌ల లింగేశ్వ‌ర‌స్వామివారికి, శ్రీ నందీశ్వ‌ర‌స్వామివారికి అభిషేకం చేస్తారు. రాత్రి 7 నుండి 12 గంట‌ల వ‌ర‌కు హ‌రిక‌థ‌, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

ఫిబ్ర‌వ‌రి 22న అర్థ‌రాత్రి 12 నుండి ఉద‌యం 6 గంటల వ‌ర‌కు మ‌హ‌న్యాస‌పూర్వ‌క రుద్రాభిషేకం నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత ఉద‌యం 10 గంట‌ల‌కు స్వామివారి క‌ల్యాణోత్స‌వం ప్రారంభ‌మ‌వుతుంది. రూ.300/- టికెట్ కొనుగోలు చేసి గృహ‌స్తులు(ఇద్దరు) క‌ల్యాణోత్స‌వంలో పాల్గొన‌వ‌చ్చు. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు గ్రామోత్స‌వం నిర్వ‌హిస్తారు. టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ పి.సుబ్ర‌మ‌ణ్యం ఆధ్వ‌ర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.