MAN WITH A “PEN CAMERA” CAUGHT BY TTD VIGILANCE IN TIRUMALA _ తిరుమలలో నిఘా కెమరా కలిగిన భక్తుని గుర్తించిన తి.తి.దే నిఘా విభాగం 

TIRUMALA, FEB 5:  The TTD Vigilance and Security sleuths on Monday evening had caught hold of a pilgrim, while he was entering the Vaikuntham I queue complex with a “Spy Camera(Pen Camera)”.
 
Vaikuntham I AVSO Sri Mallikarjun who smelt something fishy by the glance of the man who came by foot path route, stopped him at Vaikuntham I and interrogated him for about an hour. The person has been identified as T. Prabhakar(38) from Bangalore. During the vigilance enquiry, the person revealed his identity stating that he is a journalist in a local media. Following this, when the vigilance sleuths contacted the concerned media heads, they said that he was associated with their firm couple of years ago and he is no more working in their organisation. The TTD vigilance has handed over the person to I Town Police for further investigation on Monday night. 
 
Based on this incident, the TTD Chief Vigilance and Security Officer Sri GVG Ashok Kumar on Tuesday in a press statement stated that the entry of pilgrims to srivari temple with electronic gadgets is strictly banned as per TTD norms. “Keeping in view the temple security we have adopted some strict rules which we have been following since several years. If any pilgrim resorts to such act violating TTD norms, serious action will be taken against such person”. 
 
Hence, the pilgrims are requested to co-operate with TTD for the smooth running of temple administration. 
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో నిఘా కెమరా కలిగిన భక్తుని గుర్తించిన తి.తి.దే నిఘా విభాగం

తిరుమల, 5 ఫిబ్రవరి 2013: తిరుమలలో 4వ తేది సోమవారం సాయంత్రం 3.50 ని||ల ప్రాంతంలో కాలిబాట మార్గంలో వచ్చిన ఒక భక్తుడుని వైకుంఠం-1 దగ్గర తణిఖీ చేయుచుండగా అతడు పెన్‌ కెమరా కలిగి ఉండటాన్ని తి.తి.దే నిఘా మరియు భద్రతా విభాగం సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆతడిని అపి విచారించారు.
వైకుంఠం-1 ఏ.వి.ఎస్‌.ఓ శ్రీ మల్లిఖార్జున ఆధ్వర్యంలో తి.తి.దే నిఘా విభాగం జరిపిన విచారణలో ఆ వ్యక్తి బెంగుళూరుకు చెందిన టి.ప్రభాకర్‌, వయస్సు (38)గా గుర్తించారు. అయితే అతను తానొక స్థానిక మీడియాలో విలేకరినని గుర్తింపు కార్డు చూపించగా దాని ఆధారంగా నిఘా విభాగంవారు సంబంధిత మీడియా ఉన్నతాధికారులతో సంప్రదించగా వారు అతడు 2 సంవత్సరాల క్రిందట తమ సంస్థలో పనిచేశాడని ఇప్పుడు లేదని చెప్పడం జరిగింది.
దీనితో అతడు ఉద్ధేశపూర్వకంగానే రహస్య కెమరాలతో ప్రవేశించడానికి ప్రయత్నించాడని తి.తి.దే విజిలెన్స్‌ విభాగం గుర్తించడం జరిగినది. తరువాత ఆ భక్తుణ్ణి తదుపరి విచారణ నిమిత్తం తిరుమల 1వ పట్టణ పోలీసువారికి అప్పగించడమైనది.
ఈ సంఘటన క్రమంలో తి.తి.దే ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి జి.వి.జి. అశోక్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఇకపై ఈ విధంగా ఏవరైనా భక్తులు రహస్య కేమరాలతో మరియు ఇతర నిషేధిత ఎలక్ట్ట్రానిక్‌ పరికరాలతో ఆలయంలోనికి ప్రవేశించడానకి ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుందని తెలియజేయడమైనది. ఈ విషయాన్ని గమనించి భక్తులు తి.తి.దేకు సహకరించవలసినదిగా కోరడమైనది.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.