MANAGUDI FROM AUGUST 23 _ ఆగస్టు 23 నుండి 26వ తేదీ వరకు ”మనగుడి”
Tirupati, 22 August 2018:The Sravana Pournami Managudi will be observed in about 12thousand temples in two Telugu States from August 23 to 26.
This is the 12th phase of mass spiritual program being observed by TTD.
On August 23, devotees of respective temples of their localities will clean the entire temple while on second day on August 24, Varalakshmi Vratam will be observed. On August 25, Nagara Sankeertana and Bhajans will be carried out while on August 26, Managudi kankanams, akshara, sugarcandy, turmeric, vermilion packets will distributed to devotees.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 23 నుండి 26వ తేదీ వరకు ”మనగుడి”
ఆగస్టు 22, తిరుపతి, 2018 ;టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆగస్టు 23 నుండి 26వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 11,730 ఆలయాల్లో మనగుడి కార్యక్రమం జరుగనుంది. ఈ ఆలయాలకు ఇప్పటికే అక్షింతలు, శ్రీవారి కంకణాలు, పసుపు, కుంకుమ, కలకండ తదితర పూజాసామగ్రిని పంపిణీ చేశారు.
మనగుడి కార్యక్రమంలో ఆగస్టు 23న ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల్లోని భక్తులు స్వచ్ఛందంగా ఆలయాలను శుభ్రం చేసుకుని రంగవళ్లులు, తోరణాలతో అలంకరిస్తారు. ఆగస్టు 24న వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. ఆగస్టు 25న నగర సంకీర్తన, భజన కార్యక్రమాలు చేపడతారు. ఆగస్టు 26న శ్రావణపౌర్ణమి సందర్భంగా మనగుడి ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులోభాగంగా భక్తులకు అక్షింతలు, శ్రీవారి కంకణాలు, పసుపు, కుంకుమ, కలకండ పంపిణీ చేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.