MANAGUDI – RATHA SAPTHAMI IN TELUGU STATES ON FEBRUARY 1 _ ఫిబ్ర‌వ‌రి 1న తెలుగు రాష్ట్రాల్లో ర‌థ‌స‌ప్త‌మి – మనగుడి

Tirupati 30 January 2020 ; The Hindu Dharma Prachara Parishad is all set to roll out the Managudi program in select 25 regions of both Telugu states on the auspicious festival day of Ratha Sapthami on February 1.

As a part of the program focus is on Worship of lord Surya in various formats on the day in all districts.

TTD has roped in yoga experts to conduct Surya Namaskar camps . Secondly Aditya Hrudayam Slokam Parayanam by Students, Pustaka prasadam (booklets on Ratha Sapthami significance)etc.

A special event at the SV Junior college is slated at 6.00 am as part of Ratha Sapthami and Managudi program on February 1 in Tirupati.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఫిబ్ర‌వ‌రి 1న తెలుగు రాష్ట్రాల్లో  ర‌థ‌స‌ప్త‌మి – మనగుడి

తిరుప‌తి, 2020 జ‌న‌వ‌రి 30: ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఫిబ్ర‌వ‌రి 1న శ‌నివారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో 25వ విడత మనగుడి కార్యక్రమాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా సూర్య భ‌గ‌వానుడిని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

ప్ర‌తి జిల్లాలోనూ ఈ కార్య‌క్ర‌మం ఉండేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. ఈ సంద‌ర్భంగా యోగా శిక్ష‌కుల సాయంతో సూర్య‌న‌మ‌స్కారాలు సాధ‌న చేయిస్తారు. అదేవిధంగా, విద్యార్థిని విద్యార్థుల‌తో ఆదిత్య హృద‌యం శ్లోక‌పారాయ‌ణం చేయిస్తారు. ర‌థ‌స‌ప్త‌మి ప్రాశ‌స్త్యంపై విద్యార్థుల‌కు ఉచితంగా పుస్త‌క ప్ర‌సాదం పంపిణీ చేస్తారు. ఇందులో భాగంగా తిరుప‌తిలోని ఎస్వీ జూనియ‌ర్ క‌ళాశాలలో శ‌నివారం ఉద‌యం 6 గంట‌ల‌కు ర‌థ‌స‌ప్త‌మి సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.