MANAGUDI SARE GETS DIVINE MOTHER’S BLESSINGS_శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ”మనగుడి” పూజాసామగ్రికి ప్రత్యేక పూజలు

Tiruchanoor, 23 August 2018: On the auspicious occasion of Uttarashada star, which happens to be the birth star of Sri Padmavathi Devi, the Managudi Sare was placed at the lotus feet of Goddess to get her divine blessings on Thursday evening.

Tirupathi JEO Sri P Bhaskar who took part in this fete said on the first day temples were cleansed in respective temples chosen to observe Managudi in AP and TS. Tomorrow Varalakshmi Vratam will be observed and on last day the holy items will be distributed to Pilgrims”, he added.

Temple Spl.Gr.Dy.E.O Sri Munirathnam Reddy, HDPP secretary Sri Ramana Prasad were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ”మనగుడి” పూజాసామగ్రికి ప్రత్యేక పూజలు

తిరుచానూరు 23,ఆగస్టు,2018 ;తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గురువారం సాయంత్రం ”మనగుడి” పూజాసామగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారు జన్మించిన ఉత్తరాషాడ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన గజవాహన సేవలో టిటిడి తిరుపతి జెఇఓ శ్రీ పోల భాస్కర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తిరుపతి జెఇఓ మాట్లాడుతూ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా మొదటిరోజు ఆలయశోభ జరిగిందని, ఆగస్టు 24న వరలక్ష్మీ వ్రతం, ఆగస్టు 25న నగర సంకీర్తన, ఆగస్టు 26న శ్రావణపౌర్ణమి సందర్భంగా మనగుడి ఉత్సవం నిర్వహిస్తామని వివరించారు. ఈరోజు అమ్మవారి చెంత అక్షింతలు, శ్రీవారి కంకణాలు, పసుపు, కుంకుమ, గాజులు, కలకండ తదితర పూజాసామగ్రికి పూజలు చేశామని, వీటిని వరలక్ష్మీ వ్రతం, మనగుడి సందర్భంగా భక్తులకు పంపిణీ చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక శ్రేణి డెప్యూటి ఈఓ శ్రీ మునిరత్నంరెడ్డి, హెచ్ డిపిపి కార్యదర్శి డా.. రమణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.