MASS CHANTING OF VISHNU SAHASRANAMA PARAYANAM ON FEB 1 _ ఫిబ్రవరి 1న తిరుమ‌ల‌లో విష్ణు సహస్రనామ అఖండ పారాయణం

TIRUMALA, 30 JANUARY 2023: The mass chanting of Sri Vishnu Sahasranama Parayanam will be observed on the day of Bhishma Ekadasi on February 1 by TTD at the Nadaneerajanam Mandapam in Tirumala.

This spiritual event will take place between 6am and 9am and will be telecasted live on SVBC for the sake of global devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఫిబ్రవరి 1న తిరుమ‌ల‌లో విష్ణు సహస్రనామ అఖండ పారాయణం

తిరుమ‌ల‌, 2023 జనవరి 30: భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య తిరుమల నాదనీరాజనం వేదిక‌పై విష్ణు సహస్రనామ అఖండ పారాయణం నిర్వహించనున్నారు.

వేదపండితులు శ్రీ రామానుజచార్యులు పర్యవేక్షణలో, జాతీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి డాక్టర్ జి ఎస్ ఆర్ కృష్ణమూర్తి, తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పండితులు డాక్టర్ వెంకటాచలపతి విష్ణు సహస్రనామ విశిష్టతను భక్తులకు వివరిస్తారు. మూడుసార్లు విష్ణు సహస్రనామం పారాయణం జరుగుతుంది. ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల పండితులు, అధ్యాపకలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కొరకు ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయనుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.